ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. సంవత్సరానికి ఏకంగా లక్షన్నర రూపాయలు పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ లో ఒకటైన కొత్త జీవన్ శాంతి ప్లాన్ నం.858 బెస్ట్ స్కీమ్స్ లో ఒకటిగా ఉంది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. లైఫ్ లాంగ్ గ్యారంటీడ్‌ ఆదాయాన్ని అందించే ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. కనీస పర్చేజ్ ధర లక్షన్నర రూపాయలు కాగా ఎక్కువ మొత్తం కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. 30 ఏళ్ల వయస్సులో 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి వార్షిక పెన్షన్ రూ. 86,784 పొందే అవకాశం అయితే ఉంటుంది.

12 ఏళ్ల పాటు యాన్యుటీ చెల్లింపులను వాయిదా వేసిన వాళ్లు మాత్రం సంవత్సరానికి రూ.1,32,920 పొందవచ్చు. 45 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలతో ఈ పాలసీని తీసుకుని ఐదేళ్ల తర్వాత బెనిఫిట్స్ పొందాలని భావించే వాళ్లకు రూ.90,456 వార్షిక పెన్షన్ లభిస్తుంది. 45 ఏళ్ల వయస్సులో కొనుగోలు చేసి 12 సంవత్సరాల తర్వాత పెన్షన్ తీసుకుంటే సంవత్సరానికి 1,42,000 రూపాయలు పొందవచ్చు.

సమీపంలోని బ్రాంచ్ ద్వారా ఈ పాలసీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పాలసీలు ఎలాంటి రిస్క్ లేని పాలసీలు కావడంతో ఈ పాలసీలలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.