దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. సరైన స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఎన్నో ప్రయోజనాలను పొందే అవకాశం ఉండవచ్చు. ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బులు పొందాలని భావించే వాళ్లు జీవన్ అక్షయ పాలసీని తీసుకుంటే మంచిది. ఈ పాలసీ ఒక విధంగా రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పవచ్చు.
పదవీ విరమణ పొందే డబ్బులను పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం లక్ష రూపాయల నుంచి ఈ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ స్కీమ్ లో 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి 28,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్లాన్ లో 35 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 16,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు లైఫ్ లాంగ్ పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ గురించి అవగాహన ఉంటే మాత్రమే పెట్టుబడి పెడితే మంచిది.
సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ లేదా ఎల్.ఐ.సీ ఏజెంట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మనీ రిటర్న్ ఆప్షన్ ను ఎంచుకుంటే పెట్టిన డబ్బులను వెనక్కు పొందే అవకాశం ఉంటుంది. ఆ ఆప్షన్ ను ఎంచుకోని పక్షంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని వెనక్కు పొందే అవకాశం అయితే లేదు.