రిస్క్ లేకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అని చెప్పవచ్చు. తక్కువ పెట్టుబడితో పోస్టాఫీస్ స్కీమ్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తాయి. ఈ స్కీమ్స్ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో తక్కువ పెట్టుబడితో కళ్లు చెదిరే లాభాలు సొంతమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు అధిక రాబడి రేటును పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ అద్భుతమైన ఆప్షన్ అవుతుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ సమయం 15 సంవత్సరాలు కాగా 25 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ ను పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ లభిస్తుండటం గమనార్హం.
రోజుకు 417 రూపాయల పెట్టుబడితో 22.5 లక్షల రూపాయలు పెట్టుబడి కాగా 40 లక్షల రూపాయలు ఆదాయం పొందవచ్చు. పెట్టిన పెట్టుబడితో పోల్చి చూస్తే రెట్టింపు మొత్తం పొందే అవకాశం ఉండటంతో లాభం చేకూరుతుంది. పెట్టుబడిని మరో పదేళ్లు పొడిగించుకుంటే ఏకంగా కోటి రూపాయలు సొంతమవుతాయి. ఎక్కువ మొత్తంలో ఆదాయం ఉన్నవాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది.
పోస్టాఫీస్ స్కీమ్స్ గురించి సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆదాయానికి అనుగుణంగా సేవింగ్స్ చేస్తే ఎన్నో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.