ఎల్ఐసీ సూపర్ పాలసీ.. కొత్త టర్మ్ ప్లాన్ తో ప్రీమియం డబ్బులు వెనక్కు పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అమలు చేస్తూ ఆ పాలసీల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ జీవిత భీమా సంస్థ అయిన ఈ సంస్థ జీవన్ కిరణ్ పేరుతో ఒక కొత్త పాలసీని అమలులోకి తెచ్చింది. నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ గా ఈ పాలసీ అమలవుతోంది.

 

సాధారణ టర్మ్ పాలసీలలో ప్రీమియం మొత్తాన్ని వెనక్కు తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. అయితే ఈ పాలసీలో మాత్రం ఇతర పాలసీలకు భిన్నంగా బీమా హామీతో పాటు ప్రీమియం సొమ్మును వాపస్ గా పొందే అవకాశం అయితే ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీకి అర్హులు కాగా పదేళ్ల నుంచి 40 ఏళ్ల పాలసీ టర్మ్ తో ఈ పాలసీ అమలవుతోంది.

 

కనీసం 15 లక్షల రూపాయల హామీతో ఈ పాలసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీస ప్రీమియం మొత్తం 3000 రూపాయలు కాగా సింగిల్ ప్రీమియం మొత్తం 30000 రూపాయలుగా ఉండనుంది. పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ తర్వాత ప్రీమియం మొత్తాన్ని పొందే అవకాశం ఉండనుంది. కవరేజీ సమయంలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని కుటుంబం పొందుతుంది.

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వెబ్ సైట్ ద్వారా లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ద్వారా పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. పాలసీకి సంబంధించిన షరతులను తెలుసుకుని ఈ పాలసీని కొనుగోలు చేస్తే మంచిది. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.