ఆడపిల్లలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన LIC.. రోజుకు రూ.75 ఆదాతో రూ.14 లక్షలు?

ప్రస్తుత కాలంలో తల్లీదండ్రులు ఆడపిల్లలను చదివించడానికి, ఆడపిల్లలకు పెళ్లి చేయడానికి ఎంతో మొత్తం ఖర్చు చేస్తున్నారు. అయితే సరైన పాలసీలను తీసుకోవడం వల్ల తల్లీదండ్రులు తమపై పడే భారాన్ని సులభంగా తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. బాలికల విద్య, వివాహ ఖర్చులకు ఆర్థిక తోడ్పాటు అందించే విధంగా ఈ పాలసీ ఉండనుందని సమాచారం అందుతోంది.

18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. లబ్ధిదారుడు మరణిస్తే కుటుంబానికి 5 లక్షల రూపాయల డెత్ బెనిఫిట్ లభిస్తుంది. కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విషయంలో ఈ పాలసీ ఎంతో బెస్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రమాదం వల్ల లబ్ధిదారుడు మరణిస్తే 10 లక్షల రూపాయల డెత్ బెనిఫిట్ లభిస్తుంది.

25 సంవత్సరాల పాటు ఈ పాలసీలో ఎవరైతే డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు 27 లక్షల రూపాయలు లభించే అవకాశం అయితే ఉంటుంది. పాలసీదారుడు మరణించిన సమయంలో ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదని సమాచారం అందుతోంది. మెచ్యూరిటీ సమయానికి మూడేళ్ల ముందు వరకు లైఫ్ రిస్క్ కవరేజీని పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వాళ్లు అవసరం అనుకుంటే లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించే అవకాశం ఉండటంతో పాలసీ తీసుకున్న వాళ్లకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. ఈ పాలసీ గురించి పూర్తిగా అవగాహన ఉంటే ఈ పాలసీని తీసుకుంటే మంచిది. రోజుకు 75 రూపాయలు పొదుపు చేస్తే 14 లక్షల రూపాయలు మెచ్యూరిటీ తర్వాత పొందవచ్చు.