‘నోటా’ US కలెక్షన్స్  అంత దారుణమా?

‘పెళ్లిచూపులు’,‘అర్జున్ రెడ్డి’,‘గీత గోవిందం’ వరసపెట్టి మూడు హిట్స్. విజయ్ దేవరకొండని కెరీర్ పరంగా పీక్స్ తీసుకెళ్లిపోయాయి. దేవరకొండ కు తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాక ఓవర్ సీస్  లోకూడా ఫ్యాన్స్, మార్కెట్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో రీసెంట్ గా విజయ్ దేవరకొండ ‘నోటా’ చిత్రం
ప్రేక్షకులముందుకొచ్చింది.. అంచనాలను తలక్రిందులు చేస్తూ.., డివైడ్ టాక్ తెచ్చుకుంది.. తమిళ్‌లోనూ అదే పరిస్దితి.

అయితే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే..అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు, ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండటం. అయితే మార్నింగ్ షో టాక్ కే ఆ పరిస్దితి మారిపోయింది. కలెక్షన్స్ డ్రాప్ అవటం స్టార్టైంది. టాక్ వైరల్ గా మారింది. నోటా చూసి నోటి మాట రాలేదంటూ కామెంట్స్ వినపడ్డాయి.  చాలా మంది అభిమానం చూరుగున్న యుఎస్ లో సైతం అదే పరిస్దితి.

గీతా గోవిందంతో రెండున్నర మిలియన్ డాలర్స్ గ్రాస్ సాధించిన దేవరకొండ ఈ సినిమాతో యుఎస్ మార్కెట్లో ఒక్కసారిగా డల్ అయ్యారు. అక్కడ పెద్ద డిజాస్టర్ గా మారింది.  మొదటి వారాంతం మూడు రోజుల్లో కేవలం $325k సాధించింది. ఈ మొత్తం గీతాగోవిందం ప్రీమియర్ కలెక్షన్స్  కన్నా చాలా తక్కువ.  మరో ప్రక్క నాగార్జున, నానిల దేవదాసు చిత్రం సైతం సెకండ్ వీకెండ్ లో డ్రాప్ ఉంది. ఆ సినిమా కూడా యుఎస్ మార్కెట్లో ఫ్లాఫ్ అనే చెప్పాలి.