తమ సినిమా సెన్సార్ లో ఆగిపోయి కానీ లేదా ఏదో ఒక వివాదంలో కానీ చిక్కుకుంటే నీ దగ్గరకు వస్తాము దేవుడా అని సినిమా నిర్మాతలు మొక్కుకుంటారని అప్పట్లో కొన్ని జోక్స్ వినపడేవి. ఎందుకంటే వివాదం అంటే ఫ్రీ పబ్లిసిటీ…రూపాయి ఖర్చుపెట్టకుండా జనాలకు థియోటర్స్ కు లాక్కెళ్లే మార్గం అని కొంతమంది నమ్ముతారు.
అయితే అది అన్నిసార్లు నిజం కాదు. వివాదాలు ఒక్కోసారి రివర్స్ అవుతాయి. కొందరు మనోభావాలు దెబ్బతిని సినిమాలను బహిష్కరించిన ధాకలాలు ఉన్నాయి. మరి సర్కార్ వివాదం…కలెక్షన్స్ ఏమన్నా ఉపకరించిందా..లేక దెబ్బ తీసిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగులో ఆ వివాదం ప్రభావం ఏమి లేదు కానీ తమిళనాట మాత్రం సర్కార్ వివాదం ఈ రోజుకీ భగ్గుమంటోంది. దాంతో ఎలాగైనా ఈ సినిమాని ఆపాలని, కలెక్షన్స్ తగ్గితే బాగుండును అని ఓ వర్గం ప్రయత్నం చేస్తూంటే , విజయ్ ఫ్యాన్స్ ..సానుభూతి పరులు మాత్రం ఒకటికి నాలుగుసార్లు చూసైనా ఈ సినిమాని పెద్ద హిట్ చేసి..ఈ సినిమాపై దాడి చేస్తున్నవారికి బుద్ది చెప్పాలని భావిస్తున్నారు. వీటి ప్రభావం కలెక్షన్స్ పై పాజిటివ్ గా ఉంది. దాంతో కలెక్షన్స్ ఓ రేంజిలో ఉన్నాయి.
దీపావళి సందర్భంగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.145 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అఫీషియల్ గా ప్రకటించాయి. రూ.150 కోట్ల క్లబ్‌కు చేరువగా ఉందని చెప్పారు. ఓవర్ సీస్ లోనూ ఈ సినిమా తన విజయపతాకాన్ని ఎగరవేస్తోంది.
ఇక ఈ సినిమా అమెరికాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. యూకేలో రూ.4 కోట్లు వసూలు చేసిందట. నవంబరు 16 వరకు బాక్సాఫీసు వద్ద ‘సర్కార్’ స్పీడు ఇలానే ఉంటుందని చెబుతున్నారు.
రాజీ జరిగింది కానీ..
విజయ్ హీరోగా విడుదలైన ‘సర్కార్’ చిత్రం ఎలా ఉందనే దాని కన్నా ..ఆ సినిమాలో సీన్స్ తొలిగించాలంటూ జరుగుతున్న వివాదం మీడియాలో హైలెట్ అయ్యింది. ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా చాలా సీన్స్ ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. దర్శకుడితో పాటు ‘సర్కార్’ చిత్ర యూనిట్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో రోజు రోజుకీ వివాదం ముదరటం, ఆందోళనలకు దారి తీస్తూండటంతో.. అనవసరమైన గొడవలు ఎందుకని ఆ సీన్స్ ను తొలగించేందుకు చిత్ర యూనిట్ అంగీకరించింది. అయితే థియోటర్స్ వద్ద పోస్టర్స్, హోర్డింగ్స్ తొలిగించారు. దాంతో సహజంగా ఆ బ్యానర్స్ ,హోర్డింగ్ లు పెట్టిన ఫ్యాన్స్ కు కాలింది. దాంతో ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ వైపు నుంచి రచ్చ మొదలైంది. వాళ్లు ఈ ఇష్యూని వదిలేది లేదంటూ విజయ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.