‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్)

‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియా వైజ్)

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. అన్ని భాష‌ల్లోనూ రేపు( జులై 26న) విడుద‌ల కానుంది డియ‌ర్ కామ్రేడ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపద్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏయే ఏరియాల్లో..ఎంత జరిగింది వంటి విషయాలు చూద్దాం. వరల్డ్ వైజ్ థియోట్రకల్ రైట్స్ ని 34.60 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఏరియా వైజ్ బ్రేకప్ డిటేల్స్.

ఏరియా బిజినెస్ (కోట్లలో)

——————– —————————————-
నైజాం 9.00
సీడెడ్ 3.60
వైజాగ్ 2.40
ఈస్ట్ గోదావరి 1.80
కృష్ణ 1.60
గుంటూరు 2.00
వెస్ట్ గోదావరి 1.40
నెల్లూరు 0.80

ఏపీ /తెలంగాణా 22.60

భారత్ లో ఇతర ప్రాంతాలు 8.00
ఓవర్సీస్ 4.00

టోటల్ వరల్డ్ వైడ్ 34.60 కోట్లు

డియర్ కామ్రేడ్ సినిమా ఒకే కాలేజీలో చదువుతున్న ఓ కాలేజ్ స్టూడెంట్ కు, ఓ మహిళా క్రికిటర్ కు మధ్య జరిగే ప్రేమ కథగా చెప్తున్నారు .‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.