‘ఘాజీ’ లాంటి హిట్ సినిమా తర్వాత సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన సినిమా అంతరిక్షం. ఘాజీ విభిన్న తరహా చిత్రం కావటం, ఈ సినిమా బ్యాక్ డ్రాప్ స్పేస్ కావటంతో ఈ సినిమా ఎలా ఉంది అనే ఆసక్తి అందర్లోనూ ఉంది. వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమాకి యుఎస్ ప్రీమియర్స్ భారీగానే పడ్డాయి. ఈ నేఫధ్యంలో చిత్రం టాక్, కథ ఎలా ఉందో చూద్దాం.
కథ విషయానికి వస్తే..
దేవ్ అనే వ్యోమోగాని.. పరిస్దితులు సహకరించకపోవటంతో గత ఐదేళ్లుగా తన మిషన్ ని కంప్లీట్ చేయలేకపోతాడు. ఈ లోగా అతనికి ఓ శాటిలైట్ లో వచ్చిన సమస్యను పరిష్కరించటానికి ఎంపిక చేయబడతాడు. ఆ సమస్యను పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా కమ్యునికేషన్ బంద్ అయ్యిపోతుంది. దాంతో ఆ పనిమీద స్పెస్ లోకి వెళ్లిన దేవ్ టీమ్ ఊహించని పరిణామాలను ఎదుర్కొంటుంది. వాటిని ఆ టీమ్ ఎలాపరిష్కరించుకుందనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ లోగా దేవ్ తీసుకున్న ఓ నిర్ణయం మొత్తం టీమ్ ని షాక్ కు గురి చేస్తుంది. అదేమిటి…చివరకు ఆ శాటిలైట్ ని సెట్ చేసి కమ్యునికేషన్ సిస్టమ్ ని సెట్ చేసారా లేదా అనేదే మిగతా కథ.
ఎలా ఉంది..
ఈ చిత్రం టార్గెట్ ఆడియన్స్ అంటే మల్టిఫ్లెక్స్ ప్రేక్షకులకు బాగా చదువుకున్నవాళ్ల కు బాగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు అంతంత మాత్రమే. అలాగే ఓవర్ సీస్ లో కూడా మంచి టాక్ నడుస్తోంది. అయితే ఇలాంటి సినిమాలకు కీలకంగా నిలవాల్సిన విఎఫ్ ఎక్స్ టీమ్ మాత్రం అద్బుతమైన స్దాయిలో అవుట్ పుట్ ఇవ్వలేదని చెప్తున్నారు.
అలాగే సినిమాలో సైన్స్ పరంగా తెలయని కొన్ని కొత్త విషయాలు ఉన్నా..అవి ఎంతవరకూ అర్దమవుతాయో చూడాలంటున్నారు. సినిమా ఇంట్రస్టింగ్ గానే ఉన్నా స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు బాగా ప్లస్ అయ్యిందని, ఘాజీ స్దాయిలో మాత్రం సినిమా లేదని చెప్తున్నారు.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, సాయిబాబు జాగర్లమూడి, వై రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.