రీసెంట్ గానే టాలీవుడ్ యంగ్ జంట ఒకరు వివాహ బంధంతో ఒకటైన సంగతి అందరికీ తెలిసిందే. వారే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి.. ఇక ఇప్పుడు నుంచి కొణిదెల లావణ్య గా మారిన తాను మెగా ఇంట అడుగు పెట్టగ రీసెంట్ గానే పెళ్లి మరియు రిసెప్షన్ లని ఇటలీ, హైదరాబాద్ లో మెగా కుటుంబం ఘనంగా జరిపించారు.
ఇక ఇదిలా ఉండగా వీరి పెళ్లి వీడియో కి సంబంధించి కొన్ని రూమర్స్ పదే పదే ఏదో తమకే ముందు తెలుసు అన్నట్టుగా కొందరు వారి పెళ్లి వీడియోని ప్రముఖ ఓటిటి సంస్థ అయినటువంటి నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారని పైగా ఏకంగా 8 కోట్లు చెల్లించి రైట్స్ కొనుకొని తర్వాత వారి పెళ్లిని స్ట్రీమింగ్ కి తీసుకొస్తారని కొందరు ఫ్లాష్ న్యూస్ లు లా తమకే తెలిసింది అన్నట్టుగా ప్రచారాలు చేసుకున్నారు.
కానీ ఇక్కడే సీన్ కట్ చేస్తే అసలు ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని మెగా కాంపౌండ్ తేల్చి చెప్పేసింది. అసలు ఎలాంటి స్ట్రీమింగ్ వీడియోలు గాని ఎక్కడా ఇవ్వలేదు ఎందులోని స్ట్రీమింగ్ లాంటివి లేవు అవన్నీ ఫేక్ ప్రచారాలు అని మెగా కుటుంబం నుంచి క్లారిటీ వచ్చేసింది.
దీనితో పాపం మెగా యువ జంట పెళ్లి అడ్డు పెట్టుకుని మైలేజ్ తెచ్చుకుందాం అనుకునే వారికి మెగా ఫ్యామిలీ గూబ గుయ్యిమనించేలా సమాధానం అందించారు. దీనితో టాలీవుడ్ పి ఆర్ లకి వరుణ్ తేజ్ టీం ఇచ్చిన ఈ సమాచారం అధికారికంగా ఖండించి క్లారిటీగా ప్రచారం చేయబడుతుంది.
The ongoing speculations around the OTT rights of #VarunLav #VarunTej & #LavanyaTripathi's wedding are completely baseless and untrue.
Requesting everyone not to believe in such rumours and spread them.
– Team #VarunTej pic.twitter.com/EXERJNY1jz
— BA Raju's Team (@baraju_SuperHit) November 7, 2023