ప్రస్తుతం మెగా కుటుంబం మరియు మెగా ఫాన్స్ అంతా కూడా మాట్లాడుకుంటున్న అంశం యంగ్ హీరో హీరోయిన్స్ వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ కోసం అని చెప్పాలి. మరి ఈ పెళ్లి మహోత్సవం రేపు నవంబర్ 1 న ఇటలీ లో సింపుల్ గా ప్లాన్ చేసుకోగా..
ఈ వేడుకకి గాను మెగా కుటుంబం నుంచి అంతా కూడా హాజరు అవుతున్నారు. కాగా వీరి అందరిలో అయితే హీరో పవన్ కళ్యాణ్ మరియు తన మూడో భార్య కూడావెళ్ళింది. అయితే ఈ పెళ్ళికి తాను కూడా వెళ్లాల్సి ఉంది అని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
తనకి వరుణ్ కి తన చిన్న నాటి నుంచి మంచి అనుబంధం ఉండేది అని వరుణ్ తో తనతో చక్కగా ఉండేవాడు అయితే నేను కూడా వారి పెళ్ళికి వెళ్లాల్సి ఉంది కానీ అక్కడికి వెళితే నేను కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతాను అందుకే వెళ్లడం లేదని రేణు దేశాయ్ తెలిపింది.
అయితే తన ఆశీస్సులు మాత్రం ఎప్పటికీ వారిద్దరికీ ఉంటాయని రేణు దేశాయ్ చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక రేణు దేశాయ్ నటించిన లేటెస్ట్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” తో టాలీవుడ్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వగా ఆమె ఈ చిత్రంతో పాటుగా మరిన్ని సినిమాలు నటిస్తూ నిర్మాణం కూడా వహిస్తున్నారు. అలాగే ఫ్యూచర్ లో భారీ ప్రాజెక్ట్ కూడా నిర్మించనున్నానని ప్రామిస్ చేశారు.