లక్కీ లావణ్యా..తన మొదటి సినిమాలోదే నిజం అయ్యిందిగా

Lavanya-Tripathi-wiki-age-family-husband-movies-biography

టాలీవుడ్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఫ్యామిలీ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అని చెప్పాలి. ఉన్న హీరోస్ లో ఆల్ మోస్ట్ అంతా 100 కోట్ల హీరోలు ఉన్నారు. ఇక వారితో పాటుగా టైర్ 2 హీరోస్ కూడా ఉన్నారు. మరి వారిలో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ఒకడు కాగా తాను యంగ్ నటి లావణ్య త్రిపాఠి ని అయితే ప్రేమించి పెద్దల సమక్షములో పెళ్లి చేసుకున్నాడు.

దీనితో మెగా ఇంట సంబరాలు జరుపుతుండగా ఇపుడు లావణ్య విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లోకి లావణ్య ఎప్పుడో 2012 లో హీరోయిన్ గా మొదటి సినిమా “అందాల రాక్షసి” తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అక్కా నీ పెళ్ళికి హీరోలు వస్తున్నారు అని కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆమె ఒక హీరోని పెళ్లి చేసుకోడమే కాకుండా మొత్తం మెగా హీరోస్ అందరి సమక్షంలో ఆమె పెళ్లి జరిగింది. దీనితో అసలు లావణ్య ఎంత లక్ అనేది అర్ధం చేసుకోవచ్చు. దీనితో ఇలా ఈ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఆమె రియల్ లైఫ్ లో కూడా కలవడం వైరల్ గా మారింది. ఇక ఇపుడు పెళ్లయ్యాక ఒకోకరు ఇండియాకి తిరిగి వస్తున్నారు.