పెళ్లి తర్వాత తన సినిమాని మర్చిపోయిన వరుణ్ తేజ్..

గత కొన్ని వారాల కితమే మెగా ఫ్యామిలీ ఇంట ఓ శుభ కార్యం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ అలాగే ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి లు  గెలిపించుకొని తమ పెద్దల అంగీకారంతో ఇటలీలో తమ పెళ్లి చేసుకున్నారు. మరి అక్కడ నుంచి వచ్చాక కూడా మంచి రెసెప్షన్ ని కూడా చేసుకున్నారు.

దీనితో కొన్ని రోజులు పాటు అలా మెగా ఇంట సంబరాలు నడిచాయి ఇప్పుడు ముగిసాయి. పవన్ రాజకీయాలు అని చరణ్ గేమ్ చేంజర్ లోకి వచ్చి బిజీ అయ్యాడు ఇక చిరు కూడా తన 156వ సినిమాలో జాయిన్ అయ్యారు. కానీ హీరో వరుణ్ తేజ్ సినిమాని మర్చిపోయినట్టు ఉన్నాడని చెప్పాలి.

ఈ డిసెంబర్ లోనే వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఎప్పుడో డిసైడ్ చేసారు. డిసెంబర్ 8న వస్తున్నట్టుగా చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే అసలు ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కూడా లేదు.

ఈ సినిమాతో రేస్ లో ఉన్న నాని, నితిన్ చిత్రాలు అయితే ఆల్రెడీ ట్రైలర్ అని పాటలు అని అంతా హడావుడి చేస్తున్నారు కానీ వరుణ్ తేజ్ సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ఉలుకూ లేదు దీనితో సినిమా వాయిదా పడినట్టే అని అనుకోవాలి. మరి సినిమా వాయిదా పడిందా లేదా అనేది వేచి చూడాలి మరి.