‘2.0’కలెక్షన్స్ అంత తక్కువా..అంతా షాక్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.0’ భారీ అంచనాల మధ్య నిన్నటి రోజు అనగా గురువారం విడుదలైంది. అభిమానులు ఓ ఉత్సవంలా జరుపుకొన్నారు. ట్రేడ్ వర్గాలు వారు ఊహించినట్లుగానే ఈ చిత్రం మొదటి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ.19 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి. తెలుగులో ఇప్పటివరకు విడుదలైన రజనీ సినిమాల్లో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

అయితే ‘2.0’ చిత్రం యుఎస్ లో భారీ స్క్రీన్స్ల్ విడుదలవటంతో రెండు మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేసారు. అయితే కేవలం అందులో నలబై శాతం మాత్రం ఓపినింగ్స్ వచ్చింది. కబాలి చిత్రం కు వచ్చినంత (2.7 మిలియన్ డాలర్లు) ఓపినింగ్స్ ఈ సినిమాకు రాకపోవటం ఎవరికీ అర్దం కానీ విషయం. చాలా తక్కువ ఎమౌంట్స్ ఫస్ట్ డే వచ్చినట్లు సమాచారం. ఈ వీకెండ్స్ లో పికప్ కాకపోతే యుఎస్ లో ఎక్కువ రేటు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ లాస్ లో పడుతారని అంచనా వేస్తున్నారు.

 అమెరికాలో ‘2.0’ చిత్రం 265 ప్రదేశాల్లో విడుదలైంది. తొలిరోజు రాత్రి పది గంటల వరకు ఈ సినిమా రాబట్టిన కలెక్షన్లు 295000 డాలర్లు(రూ.2,05,54,125). న్యూజిలాండ్‌లో 18 ప్రదేశాల్లో విడుదలైన ఈ చిత్రం 23,243 న్యూజిలాండ్‌ డాలర్లు (రూ.11.11 లక్షలు) రాబట్టింది. ఆస్ట్రేలియాలో 114,696 ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ.58.46 లక్షలు) రాబట్టింది. అక్కడ ఈ చిత్రం 35 ప్రదేశాల్లో విడుదలైంది.

ఇప్పటికే ఈ చిత్రం తమిళనాడులోని చెన్నై నగరంలో రూ.2.64 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు అక్కడ ఏ చిత్రం కూడా తొలిరోజు ఇంతటిస్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. విజయ్‌ నటించిన ‘సర్కార్’ విడుదలైన తొలిరోజు చెన్నై నగరంలో రూ.2.37 కోట్లు రాబట్టింది. పండుగ సమయంలో కాకుండా మామూలు రోజుల్లో విడుదలైనప్పటికీ ‘2.0’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. కర్ణాటకలో ఈ చిత్రం తొలిరోజు వసూళ్లు దాదాపు రూ.8.25 కోట్లు. హిందీ వెర్షన్‌లో ఈ చిత్రం దాదాపు రూ.25 కోట్లకుపైగానే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.