ట్రేడ్ టాక్: రివ్యూలకు రివర్స్ లో కలెక్షన్స్

ఈ వారం వరసగా మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఓటర్, ఫస్ట్ ర్యాంక్ రాజు రిలీజయ్యాయి. వీటిల్లో రిలీకు ముందు బజ్ తెచ్చుకున్నవి మల్లేశం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మాత్రమే. ఈ రెండు లో బడ్జెట్ సినిమాలకు మంచి ఓపినింగ్స్ వస్తాయని సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ ని అంతా భావించారు. అలాగే రిలీజ్ అయ్యాక కూడా పాజిటివ్ రివ్యూలు, సోషల్ మీడియాలో పోస్ట్ లు ఈ రెండింటికే కనిపించాయి. అయితే దురదృష్టవశాత్తు భాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలుకు కలెక్షన్స్ మాత్రం లేవు.

టాక్ కు తగినట్లుగా ఈ రెండు సినిమాలకు ఓపినింగ్స్ కాని, కలెక్షన్స్ కానీ లేకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలంగాణాలో అయినా మల్లేశం కు మంచి కలెక్షన్స్ వస్తాయని అంతా భావించారు. అలాగే మల్టిఫ్లెక్స్ లలోనూ ఈ రెండు సినిమాలు ఆడుతాయనుకుంటే ఫలితం కనిపించటం లేదు. ఫస్ట్ వీకెండే ఇంత నిరాశగా ఉంటే మిగతా రోజుల్లో వీటి పరిస్దితి ఎలా ఉంటుందా అని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం స్లోగా జనాల్లోకి టాక్ స్ప్రెడ్ అయ్యి కలెక్షన్స్ పుంజుకుంటాయంటున్నారు.

ఇక మల్లేశం కన్నా ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ కొద్దిగా కలెక్షన్స్ వైజ్ బెస్ట్ అనిపిస్తోంది. కానీ బెటర్ మాత్రం కాదు. ఇక ఓటర్ పరిస్దితి అయితే దారుణం. ఫస్ట్ ర్యాంక్ రాజు పాసయ్యాడు అని రివ్యూలు వచ్చినా భాక్సాఫీస్ వద్ద మాత్రం ఫెయిలయ్యాడని అర్దమవుతోంది. రేపు అంటే సోమవారం ఈ రెండు సినిమాలకు పరీక్ష అని చెప్పాలి.