దమ్మేంటో చూపించింది..ఆ మైలు రాయి క్రాస్ చేసింది

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 మొన్న గురువారం విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. జస్ట్ ఓకే టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో ట్రేడ్ ని షాక్ గురి చేస్తోంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం… ఈ సినిమా గురు ,శుక్ర వారాల్లో దేశవ్యాప్తంగా 135కోట్లు, ఓవర్సీస్ లో 55కోట్ల వసూళ్లను రాబట్టి రెండు రోజులకు గాను మొత్తంగా 190 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక నిన్నటి రోజు (శనివారం) తో ఈ చిత్రం 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.

మరో ప్రక్క ఈ చిత్రం అటు బాలీవుడ్ లోనూ సెన్సేషన్ సృష్టిస్తుంది. వీకెండ్ మొదలవగానే బుకింగ్స్ వేగం పుంజుకున్నాయి. నిన్న శనివారం.. ఈచిత్రం అక్కడ సుమారుగా 25కోట్ల షేర్ ను రాబట్టి, మూడు రోజులకుగాను 62.5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. సోమవారం తో ఈ చిత్రం అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. శంకర్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

తెలుగులో మొదటి రోజు వసూళ్లు చూసి బయ్యర్లు కంగారుపడ్డారు కానీ రెండవ రోజు 2.0 సాలిడ్‌గానే నిలబడి వారికి ధైర్యాన్ని ఇచ్చింది. అంచనా వేసినట్లుగా భారీ డ్రాప్‌ లేకపోవడంతో బయ్యర్లు రిలాక్స్ అయ్యారు. తెలుగు, తమిళంలో కూడా త్రీడీ థియేటర్లలో టికెట్లు దొరకడం లేదనేది వారికి ఆనందం కలిగిస్తోంది. ఈ సినిమాని త్రీడీలోనే చూడాలని జనం ఫిక్స్‌ అవడం వల్ల టూడీ వసూళ్లు పెద్దగా లేవు. ఏదైమైనా ఈ చిత్రానికి ఈ వీకెండ్‌ చాలా కీలకం. ఫ్యామిలీస్‌, పిల్లలు ఎంతగాఈ సినిమా కోసం చూస్తున్నారనేది ఈ వీకెండ్‌తో తేలిపోతుంది. అదే ఈ సినిమా లాంగ్ రన్ గురించి స్పష్టత ఇచ్చే అంశం.