‘కల్కి’బజ్ బాగుంది కానీ బుక్కింగ్స్ లేవు

యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి. శివాని, శివాత్మిక, వైట్ లాంబ్ టాకీస్ వినోద్ కుమార్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు (శుక్రవారం) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓపినింగ్స్ ఎలా ఉండబోతున్నాయి. అడ్వాన్స్ బుక్కింగ్స్ పరిస్దితి ఏమిటి అనేది ట్రేడ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారంఈ సినిమాకు వచ్చిన బజ్ కు తగినట్లుగా ప్రీ బుక్కింగ్స్ లేవు. అడ్వాన్స్ టిక్కెట్స్ ఇచ్చే ఆన్ లైన్ పోర్టల్స్ లో కల్కి చాలా డల్ గా ఉంది. అసలు స్పీడు లేదు. థియోటర్ దగ్గర అయినా ఓపినిగ్స్ రప్పించుకుంటుందా అనేది డౌట్ గా మారింది. రాజశేఖర్ కు మార్కెట్ లేకపోవటం, ప్రశాంత్ వర్మ అంతకు చేసిన అ చిత్రం కమర్షియల్ చిత్రం కాకపోవటంతో వీరిద్దరి కాంబినేషన్ కు జనం పెద్దగా రెస్పాండ్ కావటం లేదంటున్నారు.

సినిమాకు కనుక మార్నింగ్ షో కు టాక్ బాగుండి, రివ్యూలు బాగుంటేనే సినిమాని కాపాడగలిగేదని చెప్తున్నారు. ఇక కల్కి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 28న విడుదల అవుతుండగా… అమెరికాలో ఒక్క రోజు ముందు 27న ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్, ప్రొడక్షన్ వేల్యూస్, శ్రవణ్ భరద్వాజ్ నేపథ్య సంగీతం సినిమాపై హైప్‌ మరింత పెంచాయి.

అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణాలు కీలక పాత్రల్లో నటించారు.