పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ‘హనుమాన్’తో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ, తన మైథలాజికల్ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ‘బక’ అనే టైటిల్‌తో ఓ మైథలాజికల్ డార్క్ ఫాంటసీ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇందులో ప్రభాస్ లీడ్ రోల్‌లో నటించనున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి 2898 AD, సలార్ 2, రాజా సాబ్ లాంటి భారీ సినిమాలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ‘జై హనుమాన్’ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. అయితే అదే యూనివర్స్‌లో భాగంగా ‘బక’ అనే మరో పాన్ ఇండియా మూవీని రూపొందించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ మహాభారతంలోని బకాసురుడి ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇది పూర్తిగా కొత్త యాంగిల్‌లో డిజైన్ అవుతుందని, ప్రభాస్ పాత్ర ఇప్పటివరకు చూడని రీతిలో ఉంటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ మైథలాజికల్ జానర్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఆయనతో డిఫరెంట్ కాన్సెప్ట్‌లో సినిమా చేయడం ఖచ్చితంగా అగ్రహీరోలలో ప్రశాంత్ వర్మ స్థాయిని పెంచే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా వాస్తవంగా ఫిక్స్ అయ్యిందా? ప్రభాస్ డేట్స్ కేటాయించారా? అన్న విషయంపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్, త్వరలో అధికారికంగా అనౌన్స్ కానుందని తెలుస్తోంది. ‘హనుమాన్’ విజయం తర్వాత ప్రశాంత్ వర్మ హ్యాట్రిక్ కాంబినేషన్ ను సెట్ చేసుకుంటాడా.. ప్రభాస్ తన కమిట్‌మెంట్స్ మధ్య ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రారంభిస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, ప్రభాస్-ప్రశాంత్ వర్మ కాంబో ఖరారైతే, మైథలాజికల్ టచ్ సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ కు పండగే అని చెప్పొచ్చు.