సినిమాకు పబ్లిసిటీ అవసమే కానీ మరీ ఓ రేంజిలో అబద్దాలు ఆడకూడదు. దొరికిపోయి నవ్వులు పాలు అవుతారు. ఇప్పుడు 2.0కు అదే పరిస్దితి ఎదురైంది. ఈ సినిమాని చైనా లో విడుదల చేస్తూ 56 వేలు స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నామని పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే చైనాలో ఉన్నవే అరవై వేల స్క్రీన్స్. అలాంటిది 56 వేలు స్క్రీన్స్ ఓ డబ్బింగ్ సినిమాకే ఎందుకు కేటాయిస్తారు. ఎవేంజర్స్ ..ఇన్ఫినిటీ వార్ సినిమానే అన్ని స్క్రీన్స్ రిలీజ్ కాలేదు. అలాంటిది ఓ ప్లాఫ్ సినిమాని ఎందుకు అన్ని స్క్రీన్స్ లో వేస్తారు అనే చిన్న లాజిక్ వదిలేసి ప్రచారం చేస్తున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం “2.0”. ఈ చిత్రంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో, లేడీ రోబోగా ఎమీజాక్సన్, పక్షిరాజుగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది.
లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కమర్షియల్‌గా సక్సెస్‌ను సాధించలేదు. ఇప్పుడు ఈ చిట్టి రోబో చైనాలో సందడి చేయబోతున్నాడు. జూలై 12న సినిమా చైనాలో విడుదల కానుంది. “రోబో 2.0 : రీసర్జన్స్” అనే చైనీస్ టైటిల్‌తో సినిమా అక్కడ విడుదలవుతుంది. ఐమ్యాక్స్ 3డి వెర్షన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతున్న విదేశీ చిత్రమిదే కావడం విశేషం. మరి అక్కడి ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.