గరుడవేగ చిత్రంతో ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివాని, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్‌ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది.
ఈ నేఫధ్యంలో ఈ చిత్రం రైట్స్ ఎంతకు రాధామోహన్ సొంతం చేసుకుని ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం పది కోట్ల రూపాయలకు ఈ డీల్ కుదిరిందని సమాచారం. ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాల మొత్తం రైట్స్ ను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మంచి ఓపినింగ్స్ వచ్చిన తను పెట్టన పెట్టుబడి ఓ వారంలో రికవరీ అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ డీల్ తో నిర్మాత సి కళ్యాణ్, రాజశేఖర్ ఇద్దరు ఫుల్ ఖుషీగా ఉన్నారట. ఇద్దరు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసారు.
కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ” ఈ సినిమాకు ముందు వచ్చిన రాజశేఖర్ గారి ‘గరుడవేగ’ పెద్ద సక్సెస్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘అ!’ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఆదరించారు. ఇండియాలోనూ, ఓవర్‌సీస్‌లోనూ ఆ సినిమా బాగా ఆడింది. ఇక, ఫస్ట్ రిలీజ్ అయిన ‘కల్కి’ మోషన్ పోస్టర్, తరవాత విడుదలైన టీజర్, ఆ తరవాత వచ్చిన కమర్షియల్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్, హైప్ వచ్చాయి.
క్రేజ్, కంటెంట్ చూసి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేం రెడీ అయ్యాం. త్వరలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెయిన్ ట్రైలర్ విడుదల చేయనున్నాం. అదింకా హైప్ క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకులు ఆ ట్రైలర్‌నూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు. ఈ చిత్రంలో అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ తదితరులు నటించారు.