కన్ను గీటిన పిల్లని తెరపై చూసే రోజు ఫిక్సైంది

బీకామ్ చదువుతున్న 18 ఏళ్ల కేరళ కుట్టి ప్రియ ప్రకాష్‌ వారియర్ ఆ మధ్యన సోషల్ మీడియాను షేక్‌ చేసేసింది. ఫేస్‌బుక్.. ట్విట్టర్.. వాట్సాప్.. ఎక్కడ చూసినా ప్రియ వీడియోలో హల్‌చల్ చేసాయి. కేరళ త్రిసూర్‌కు చెందిన ప్రియ ‘ఒరు ఆధార్‌ లవ్‌’ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది.

ఈ సినిమాలోని ‘మాణిక్య మలయ పూవి’పాటకొ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలోని పాటను కొంచెం ముందుగా విడుదల చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన లభించింది. కన్ను గీటుతూ ఆ పాటలో ప్రియ పలికించిన హావభావాలకు నెటిజన్లంతా ఫిదా అయిపోయారు.

ఇప్పుడు ఆ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు ఒమర్‌ లులు ట్విటర్‌ వేదికగా తెలిపారు.

సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన ‘2019 ఫిబ్రవరి 14న వాలంటైన్‌ రోజున’ అని ట్వీట్‌ చేశారు. ఒరు ఆధార్‌ లవ్ మూవీకి ముందు ప్రియ ప్రకాశ్.. మూడు షార్ట్‌ ఫిల్మ్స్‌ లో నటించింది. కొన్ని ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నది. మోడల్‌గా ర్యాంప్‌ వాక్స్‌ చేసింది.

అంతేకాదు మోహినీ అట్టం కళాకారిణి కూడా. స్కూల్‌ డేస్‌లో నాటకాల్లో నటించిన ప్రియ ప్రకాశ్ కు మలయాళ మూవీలో అనుకోకుండా అవకాశం వచ్చింది. సీబీఎస్‌సీ ప్లస్‌ 2 బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి ముందు ప్రియ ఈ సినిమా ఆడిషన్స్‌ కి వెళ్ళింది. అయితే, ఈ మూవీలో తనకు అవకాశం వస్తుందని ప్రియ ఊహించనే లేదట.. ఈ మూవీ అవకాశంతో ప్రియ ప్రకాష్‌ ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది.