Raja Saab: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల అవుతుంది అంటూ మొదట్లో మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ గత కొద్దిరోజులుగా విడుదల తేదీ వాయిదా పడబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నిర్మాత విశ్వ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజాసాబ్ గురించి మాట్లాడుతూ.. రాజాసాబ్ పార్ట్ 2 కూడా ఉంటుంది. కానీ పార్ట్ 1 కి కొనసాగింపు కాదు. అదే థీమ్, ఎలిమెంట్స్ తో ఫ్రాంచైజ్ లాగా ఇంకో రాజాసాబ్ వస్తుంది. సినిమా షూటింగ్ టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది.
సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అక్టోబర్ లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమా నిడివి 3 గంటల దాకా వచ్చేలా ఉంది. దాన్ని దర్శకుడు మారుతి 2 గంటల 45 నిమిషాలకు కుదించే పనిలో ఉన్నారు అని తెలిపారు. అనంతరం సినిమా రిలీజ్ డేట్ గురించి స్పందిస్తూ.. బిజినెస్ సర్కిల్స్ లో జనవరి 9న రిలీజ్ చేయమని అడుగుతున్నారు. హిందీ వాళ్ళు మాత్రం డిసెంబర్ 5 సినిమాలు ఏం లేవు అక్కడ అని అప్పుడే రిలీజ్ చేయమంటున్నారు. ఫ్యాన్స్ కూడా సంక్రాంతికే రిలీజ్ చేయమని అడుగుతున్నారు. త్వరలో దీనిపై ఫైనల్ డెసిషన్ తీసుకుంటాము అని తెలిపారు.
Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత.. పార్ట్ 2 కూడా ఉంటుందంటూ!
