Kingdom Movie: డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు, సినిమాకు సంబంధించిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా అప్డేట్స్ తో పాటు రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా అభిమానులకు మూవీ మేకర్స్ శుభవార్తను తెలిపారు. సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక ప్రోమోని కూడా విడుదల చేశారు ఈ సినిమాను జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ ప్రోమోను కూడా తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
కాగా రిలీజ్ డేట్ ప్రోమోలో.. ఏదైనా చేస్తా సార్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ దేవరకొండ డైలాగ్‌లో ప్రోమో అదిరిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. హీరో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ కూడా ఈ పాన్ ఇండియా సినిమా పైనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి మరి.

