Kantara: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ కాంతార. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మూవీ మేకర్స్ అప్పుడే ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాంతార 2 ను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. దీనికి కాంతార: చాప్టర్ 1 అని టైటిల్ ని పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీని ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని మూవీ మేకర్స్ ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానులకు ఆ శుభవార్తను తెలిపారు. కాంతార: చాప్టర్ 1 2025 అక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇదే విషయాన్ని హీరో రిషబ్ శెట్టి అధికారికంగా ప్రకటించారు.
ఇకపోతే మొన్నటి వరకు ఈ సినిమాను వరుసగా విషాదాలు వెంటాడిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఈ సినిమాను ఆపేస్తారేమో అని భయపడ్డారు. కానీ ఎన్ని అవాంతరాలు ఎదురైనా హీరో రిషబ్ శెట్టి మాత్రం ఈ సినిమాను ఆపేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలకు ఇన్ని నెలలు పడుతోంది. అంతే కాదు కాంతారా టీమ్ ను వరుస ప్రమాదాలు వెంటాడటంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా కాంతార సినిమా మొదట కర్ణాటకలో మాత్రమే విడుదలైంది. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ రావడంతో వివిధ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. కానీ కాంతార: చాప్టర్ 1 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు రిషబ్ శెట్టి తెలిపారు.
