రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ యుద్ధ వీరులతో కలిసి ‘యురి..ది సర్జికల్ స్ట్రైక్’ సినిమా చూసారు. బెంగళూరులోని బెల్లండూర్ సెంట్రల్ స్పిరిట్ మాల్ లో ప్రత్యేక షోకు నిర్మలాసీతారామన్ హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.
ఎట్టకేలకు యుద్ధవీరులతో కలిసి యురి సినిమా చూశానంటూ..సెంట్రల్ స్పిరిట్ మాల్ లోకి వెళ్తున్న ఓ వీడియోను నిర్మలాసీతారామన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
How’s the josh?! pic.twitter.com/8hxuCxt0P5
— Nirmala Sitharaman (@nsitharaman) January 27, 2019
లోగడ జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఇది. 2016 సెప్టెంబర్ 18న కాశ్మీర్ యురి సెక్టార్‌లోని ఆర్మీ క్యాంపుపై టెర్రరిస్టులు దాడి చేయగా.. దానికి ప్రతీకారంగా సెప్టెంబరు 29 న ఇండియన్ ఆర్మీ పాక్ శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్‌కి పూనుకొంది. ఆ వాస్తవిక సంఘటనను ఆధారంగా తీసుకుని బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య దార్..’ యురి..ది సర్జికల్ స్ట్రైక్ ‘ అనే సినిమా చేసారు.
రొన్నీ స్క్రూ వాలా బ్యానర్ పై ఆర్ ఎస్ వీ పీ నిర్మించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరో పాత్ర పోషించాడు. యామీ గౌతమ్ హీరోయిన్. పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేసే టీమ్ కమాండర్ రోల్‌లో విక్కీ నటించాడు. పరేష్ అధికారి, క్రితి కుల్హరీ, మోహిత్ రైనా, మనీష్ చౌదరి కీలక పాత్రలు ధరించిన ఈ మూవీ జనవరి 11 న విడుదల అయ్యింది.