కేంద్రం సూపర్ స్కీమ్.. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త ఇదే!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ దేశంలోని ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇప్పటికే మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్లపై 200 రూపాయలు తగ్గింపును అమలు చేస్తోంది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు దిశగా అడుగులు పడనున్నాయి.

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయని సమాచారం అందుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే ప్రజలపై ఆర్థిక భారం కూడా ఊహించని స్థాయిలో తగ్గుతుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం హోం లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు సైతం తీపికబురు చెప్పడానికి సిద్ధమైందని తెలుస్తోంది. హోమ్ లోన్ తీసుకున్న వాళ్లకు వడ్డీపై సబ్సిడీ ఇచ్చే దిశగా కేంద్రం అడుగులు పడుతున్నాయి.

త్వరలో కొత్త పథకం దిశగా కేంద్రం అడుగులు వేయనుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజాగా మాట్లాడుతూ పట్టణాలు, నగరాలలో హోం లోన్ తీసుకున్న వాళ్లకు బెనిఫిట్ కలిగేలా సెప్టెంబర్ నెలలో కొత్త పథకాన్ని మొదలుపెట్టనున్నామని తెలిపారు. త్వరలో ఈ స్కీమ్ కు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ పథకం పనులు చివరి దశలో ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు. గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం అమలులోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా పథకాలను అమలు చేస్తే హోమ్ లోన్ తీసుకునే వాళ్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ పొందవచ్చు.