ఈ ట్రైలర్ పిల్లలకు చూపెడితే..సినిమా చూపెట్టమని పీకేస్తారు

హాలీవుడ్ నుంచి వస్తోన్న మరో జంతు నేపథ్య చిత్రం మోగ్లీ: ది లెజెండ్ ఆఫ్ జంగిల్. ఆంగ్ల రచయిత రుడ్వార్డ్ కిప్లింగ్ రాసిన ‘ది జంగిల్ బుక్’ కథల ఆధారంగా మోగ్లీ పాత్ర పుట్టుకురావడం తెలిసిందే. మోగ్లీ సిరీస్‌లో భాగంగా -ది లెజెండ్ ఆఫ్ జంగిల్‌ను ఆండీ సెర్కిస్ తెరకెక్కించాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన సినిమాకు సంబంధించి హిందీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

Mowgli: Legend of the Jungle | Hindi Trailer | Netflix

ఈ చిత్రంలోని భల్లూకానికి అనిల్‌ కపూర్‌ గాత్రం అందించారు. అదే విధంగా కొండచిలువకు కరీనా కపూర్‌, తోడేలుకు మాధురీ దీక్షిత్‌, పులికి జాకీ ష్రాఫ్‌, చిరుతకు అభిషేక్‌ బచ్చన్‌ గాత్రం అందించారు. ఈ చిత్రంలో మోగ్లీ పాత్ర పేరు భగీరా. ఈ పాత్రలో రోహన్‌ చాంద్ నటించాడు.

దర్శకుడు ఆండీ సెర్కిస్ మాట్లాడుతూ ‘రెండు ప్రపంచాల మధ్య ఓ బాలుడి మానసిక ప్రయాణమే’ ఈ కథకు మూలమని వివరించారు. 1894లో రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన కథల ఆధారంగా దీన్ని తెరకెక్కించామని చెప్పుకొచ్చాడు.

చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కుర్రాడు రోహన్ చంద్ మాట్లాడుతూ ‘కథలో భాగంగా తోడేళ్ల మధ్య నేను పెరుగుతాను. అందుకే తోడేళ్ల ప్రవర్తనా తీరు, కదలికల్ని సరిగ్గా అర్థం చేసుకోడానికి తోడేళ్లకు సమీపంలో కొంతకాలం క్యాంప్ చేయాల్సి వచ్చింది. ఒకవిధంగా ఈ పాత్ర కోసం నేను రీసెర్చ్ చేసినట్టే’ అంన్నాడు.

 

ఒక్కసారి ‘జంగిల్ బుక్’ స్టోరీని గుర్తు చేసుకుంటే -అడవిలోని జంతువుల వద్ద పెరుగుతాడు మోగ్లీ. చివరకు అతను జంతు జాతిలో కలవలేడని, మనుషుల జాతిలో కలిసిపొమ్మని అడవిలోని మృగాలు చెప్పడంతో సమీపంలోని ఓ గ్రామంలోకి వెళ్లిపోతాడు. ఇక్కడి నుంచి ది లెజండ్ ఆఫ్ జంగిల్ మొదలుకానున్నట్టు తెలుస్తుంది.

‘మనుషులు అడవిలోని జంతువులను చంపేయాలని చూస్తుంటే -తమకు సాయం చేయమని జంతువులు మోగ్లీని కోరతాయి. ఇందుకు మోగ్లీ ఏం చేశాడన్నది సిరీస్‌లో భాగం కానుందని తెలుస్తుంది. తెలుగు, తమిళం, హిందీలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. డిసెంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు.