‘డియ‌ర్ కామ్రేడ్‌’ : కలెక్షన్స్ పెంచటం కోసం ఈ రెండు పనులు

‘డియ‌ర్ కామ్రేడ్‌’ : కలెక్షన్స్ పెంచటం కోసం ఈ రెండు పనులు

విజయ్ దేవరకొండ – రష్మిక మందన జంటగా నటించిన `డియర్ కామ్రేడ్` ఈ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి నచ్చినా కామన్ ఆడియెన్ నుంచి డివైడ్ టాక్ వినిపించింది. సెకండాఫ్ స్లోగా సాగడంపై వేదికలపైనే దేవరకొండ దీనిపై చర్చించారు. బాబీ-లిల్లీ లవ్ స్టోరి యూత్ కు నచ్చినా సెకండాఫ్ లో ఒక ట్విస్ట్ తర్వాత ఎమోషనల్ టర్న్ వల్లనే స్లో అయ్యిందని దేవరకొండ అన్నారు. కారణం ఏదైనా కామ్రేడ్ కి లెంగ్త్ తగ్గించి కరెక్షన్ చేశారు.

ల్యాగ్ తగ్గించటం కోసం నెమ్మదిగా సాగే చోట 15 నిమిషాల ఫుటేజ్ ని ట్రిమ్ చేశారని… అలాగే హుషారెత్తించే క్యాంటీన్ సాంగ్ ని అదనంగా జోడించారని నటుడు సుహాష్ వివరాల్ని తెలిపారు. ట్రిమ్మింగ్ త‌ర్వాత సినిమా నిడివి 2 గంట‌ల 35 నిమిషాల‌కు చేరింది. ప్రేక్షకుల అభ్యర్థన మేరకే ఈ మార్పులు చేశారని అతడు అన్నారు. ఏం చేసినా విజయ్ ఫ్యాన్స్ ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించేందుకే ఈ ప్రయత్నం.

తొలిరోజు 10 కోట్ల వసూళ్లు సాధించిందని రిపోర్ట్ అందింది. శని- ఆదివారాల కలెక్షన్స్ విషయంలోనూ డోఖా లేదని తెలుస్తోంది. తొలి వీకెండ్ ముగిశాక ఈ రోజు పరిస్దితి ఎలా ఉండనుంది అన్నదే కీలకం. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించాయి.