రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన 3. ఈ చిత్రం రివ్యూలు యావరేజ్ గా వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుంచీ అంచనాలను మించి వసూళ్ళ పరంగా భీభత్సం సృష్టిస్తోంది. తెలుగు .. తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. రెండు భాషల్లోను సేట్ టాక్..కలెక్షన్స్ టాప్ అన్నట్లుగా తన హవా చూపిస్తోంది. మాస్‌కు విపరీతంగా ఎక్కేయటంతో.. ఈ సినిమాకు బి, సి సెంటర్స్ లో హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాని తెలుగులో ఠాగూర్ మధు విడుదల చేశారు.
తాజాగా ఈ చిత్రం వంద కోట్ల మార్క్‌ను టచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో…లారెన్స్ కాంచన4ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక .. ఓవియా.. నిక్కీ తంబోలి హీరోయిన్స్ గా నటించారు.
రాఘవ లారెన్స్ మాట్లాడుతూ, ”కాంచన’ సిరీస్‌లో వచ్చిన గత చిత్రాలని దృష్టిలో పెట్టుకుని థియేటర్‌కి వచ్చే ఆడియెన్స్‌కి ఏ ఏ అంశాలు కావాలి అన్న భయంతో ఈ చిత్ర కథని రెడీ చేశా. దాదాపు రెండేండ్ల పాటు కష్టపడి రూపొందించా. ప్రేక్షకులు కోరుకున్న విధంగా సినిమా ఉండటంతో బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాని బాగా ఎంజారు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన ఆడియెన్స్‌కి థ్యాంక్స్. అలాగే తెలుగులో విడుదల చేసిన మధుకి ధన్యవాదాలు. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. థమన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
‘కాంచన’ చిత్రం వంద కోట్లు వసూలు చేసింది. దాని మాదిరిగానే ఈ సినిమా కూడా వంద కోట్లు దాటేలా ఉంది. కొంత విరామం తర్వాత ‘కాంచన 4’ చేయాలనుకున్నా. కానీ డిస్ట్రిబ్యూటర్స్, సన్ పిక్చర్స్ సంస్థ వెంటనే చేయమని కోరుతున్నారు. హిందీ ‘కాంచన’ పూర్తి కాగానే ‘కాంచన 4’ని ప్రారంభిస్తా. మా సినిమాతోపాటు విడుదలైన ‘జెర్సీ’ చూశా. చాలా బాగుంది. ఆ సినిమాని కూడా అందరు ఆదరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘నేను ఇబ్బందుల్లో ఉన్న టైమ్‌లో లారెన్స్ నాకు ఈ సినిమా ఇచ్చి సపోర్ట్‌గా నిలిచారు. విడుదలైన ఐదు రోజుల్లోనే ఇది రూ.75కోట్ల మార్క్‌ని దాటింది. త్వరలోనే వంద కోట్లని దాటే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అని ఠాగూర్ మధు తెలిపారు.