Ravi Rathod: చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 25 కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి రాథోడ్. ముఖ్యంగా రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను నటించిన సినిమాలలో ఈ సినిమాతో ఇంకా ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి. ఇకపోతే రవి రాథోడ్ ని చిన్నగా ఉన్నప్పుడే హీరో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన రాఘవ లారెన్స్ దత్తత తీసుకొని మంచి స్కూల్లో చేర్పించారు. కానీ చదువు సరిగా రాని రాథోడ్ సెలవులకు అని చెప్పి ఊరికి వెళ్లి అక్కడే ఉండిపోయాడట. ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక చదువు లేక చిన్నాచితకా పనులు చేసుకొని జీవనం సాగిస్తూ వచ్చాడు.
అదంతా పక్కన పెడితే ఇటీవల పెద్దగా మారి గుర్తుపట్టలేని స్థితిలో కనిపించిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా మద్యానికి బాగా బానిస అయ్యి మందు లేకపోతే బతకలేను అన్నంత స్థితికి చేరుకున్నాడు రవి రాథోడ్. ఇదే విషయం ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. రాఘవ లారెన్స్ గొప్పతనం గురించి చెబుతూ తన దగ్గర నుంచి పారిపోయి వచ్చానని ఇప్పుడు వెళ్లాలి అంటే భయంగా ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో హీరో రాఘవ లారెన్స్ వద్దకు చేరుకోవడంతో ఆ వీడియో పై స్పందిస్తూ నేను నిన్ను కొట్టను తిట్టను ఒక్కసారి రారా ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా చేసిన విషయం తెలిసిందే. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకుని రాఘవ లారెన్స్ ముందుకు వెళ్లాడు.
అతనిని ఆ స్థితిలో చూసిన రాఘవ వెంటనే అతనికి 50,000 ఆర్థిక సహాయాన్ని అందించాడట. ఇదే విషయం గురించి రవి రాథోడ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆల్కహాల్ అడిక్షన్ తగ్గేందుకు నాకు అన్ని టెస్టులు చేయించారు. మెడిసిన్స్ ఇచ్చారు. అయితే మాస్టర్ ఫస్ట్ నన్ను చూడగానే ఒక మాట అన్నారు. తాగేవాళ్లకు నేను సపోర్ట్ చేయను. ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని సపోర్ట్ చేస్తున్నాను అంతే అన్నారు. నన్ను చెన్నైలోనే ఉండమని అన్నారు. కానీ, నాతో పాటు ఫ్రెండ్స్ వచ్చారని హైదరాబాద్ కు వచ్చేశాను. మాస్టర్ డబ్బు సహాయం కూడా చేశారు. ఆ డబ్బుతోనే మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను. చెన్నై నుంచి వచ్చాక నేను తాగుడు మానేశాను. మెడిసిన్ వాడినప్పుడు మందు తాగితే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించాడు. అందుకే దాని జోలికి వెళ్లడం లేదు. జీవితంలో మళ్లీ తాగనని లారెన్స్ అన్నకు మాటిచ్చాడు అని తెలిపాడు. ఈ సందర్భంగా రవి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
