Raghava Lawrence: నిన్ను ఏమీ చేయను..ఒకసారి వచ్చి కలువు.. గుండె తరుక్కుపోతోంది.. ఎమోషనల్ పోస్ట్ చేసినారు రాఘవ లారెన్స్!

Raghava Lawrence : రాఘవ లారెన్స్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా నిర్మాతగా డాన్సర్ గా ఇలా అన్ని రంగాలలో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కొన్ని వేలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు రాఘవ లారెన్స్. ఇక ఆయన సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో రాఘవ లారెన్స్ నటించిన కాంచన స్టైల్ వంటి సినిమాలో ఆయనకు బాగా గుర్తింపు తెచ్చి పెట్టాయని చెప్పాలి.

ఇది ఇలా ఉంటే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించి మెప్పించిన రాఘవ లారెన్స్ ఈ మధ్యకాలంలో కాస్త స్లో అయ్యారని చెప్పాలి. సినిమాలలో పెద్దగా నటించడం లేదు. కానీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎంతోమందికి సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. లారెన్స్ చేసే సహాయ కార్యక్రమాల గురించి తెలిసిందే. సొంతంగా ఆశ్రమాలు నిర్మించి ఎంతో మంది పేదలకు నీడను కల్పించారు. కష్టంలో ఉన్నవారికి సహాయం చేశారు. ఎక్కడ ఆపద కష్టం ఉంది అంటే చాలు వెంటనే అక్కడ వాలిపోయి తన వంతు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఆయన నడిపించే ఆశ్రమాలు వృద్ధులకు, అనాథ పిల్లల ఆకలి తీరుస్తున్నాయి. అలాగే అనాథ పిల్లలకు విద్యను అందిస్తున్నారు. లారెన్స్ ఇప్పటివరకు ఎంతో మంది చిన్నారులను చదివించి వారికి మంచి జీవితాన్ని అందించారు. అయితే మాస్ సినిమా సమయంలో ఆయన ఒక చైల్డ్ ఆర్టిస్టును దత్తత తీసుకుని చదవించారట. అతను మరెవరో కాదు రవి రాథోడ్. విక్రమార్కుడు, మాస్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు రవి రాథోడ్.

మాస్ సినిమా సమయంలోనే రవి రాథోడ్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. దీంతో ఆ పిల్లాడిని లారెన్స్ దత్తత తీసుకున్నారట. అతడిని స్కూల్లో జాయిన్ చేసి అన్ని రకాల ఆర్థిక సాయాన్ని అందించారట. కానీ అప్పుడు ఆ పిల్లాడు స్కూల్ నుంచి తప్పించుకోని వెళ్లిపోవడంతో అప్పటి నుంచి ఆ పిల్లాడి కోసం లారెన్స్ వెతుకుతూనే ఉన్నారట. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు రవి రాథోడ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో లారెన్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే కొడతారో.. తిడతారో అనే భయం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో కాస్త లారెన్స్ దగ్గరకు చేరింది. ఇది చూసిన లారెన్స్ ఆ అతడిని ఒక్కసారి కలువు అంటూ ట్వీట్ చేశారు. నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. కన్నీళ్లు ఆగడం లేదు. మాస్ సినిమా సమయంలో నేను నిన్ను స్కూల్లో జాయిన్ చేశఆను. ఈ ఏడాది తరువాత నువ్వు మిస్ అయ్యావ్. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ నిన్ను చూడడం ఎంతో సంతోషంగా ఉందిరా.. వదిలి వెళ్లినందుకు నిన్ను కొడతాను.. తిడతాను అని నువ్వు భయపడుతున్నావ్.. కానీ నేనేమి అలా చేయను. ఒకసారి వచ్చి కలువు. నిన్ను చూడాలి అంటూ ట్వీట్ చేశారు లారెన్స్. ప్రస్తుతం ఆయన వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. మరి రవి రాథోడ్ రాఘవ లారెన్స్ దగ్గరికి వస్తారా లేదా అన్నది చూడాలి మరి.