హిందీలోకి‘డియర్ కామ్రేడ్’,రైట్స్ తీసుకున్న కరణ్ జోహార్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. అన్ని భాషల్లోనూ జులై 26నే విడుదల కానుంది డియర్ కామ్రేడ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.
కాగా ఈ సినిమా విడుదల అవ్వకముందే, ఈ చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. కరణ్ జోహార్ ఈ సినిమాని హిందీలో నిర్మించాలనుకోవడంతో ఈ సినిమా పై భారీగా ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి.
https://twitter.com/karanjohar/status/1153656232084934658
‘‘డియర్ కామ్రేడ్ సినిమాని మొట్టమొదటగా నేను చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక గొప్ప ప్రేమ కథ. విజయ్ దేవరకొండ, రష్మికలు అద్భుతంగా నటించారు. ఈ సినిమా మిమ్మల్ని కదిలిస్తుంది. అంతేకాక.. ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. జస్టిన్ ప్రభాకర్ మంచి మ్యూజిక్‌ని అందించారు. ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రీమేక్ చేస్తుందని తెలిపేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని కరణ్ జోహార్ పోస్ట్ చేశారు.
డియర్ కామ్రేడ్ సినిమా ఒకే కాలేజీలో చదువుతున్న ఓ కాలేజ్ స్టూడెంట్ కు, ఓ మహిళా క్రికిటర్ కు మధ్య జరిగే ప్రేమ కథగా చెప్తున్నారు. కాకినాడ టౌన్ లో జరిగే ఈ కథకు టెర్రిఫిక్ సౌండ్ ట్రాక్ పడిందని చెప్తున్నారు.
ఈ చిత్రంతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ కొడతానంటూ ధీమాగా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఈ మధ్యే విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.
‘గీత గోవిందం’ తర్వాత విజయ్, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.