‘118’ ప్రీ రిలీజ్ బిజినెస్: ఎంతొస్తే సేఫ్‌?

కల్యాణ్ రామ్, షాలినీ పాండే, నివేత థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన 118 సినిమా ఈ రోజు (శుక్ర‌వారం) విడుద‌ల అవుతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కూడా ప్రీ రిలీజ్ పంక్షన్ ని రీసెంట్ గా జరిపి ప్రాజెక్టుకు క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేసారు.

ఈ నేపధ్యంలో సినిమా ఎంతకు అమ్మారు…ఎంత పెట్టుబడి పెట్టారు అనే విషయాలు ట్రేడ్ లో చర్చనీయాంశంగా మారాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని … 11 రూపాయల బడ్జెట్ లో నిర్మించారట.

దాంతో రిలీజ్‌కి ముందే నిర్మాత‌లు సేఫ్‌గా ఉన్నట్లు సమాచారం . థియేట్రికల్ రైట్స్ కింద ఈ సినిమాను 6.90 కోట్ల రూపాయలకు అమ్మారట. కానీ హిందీ డ‌బ్బింగ్‌, తెలుగు శాటిలైట్స్ ద్వారా మంచి ఎమౌంట్ రావటం కలిసొచ్చింది. అందుకే రిలీజ్‌కి ముందు నిర్మాత‌ హ్యాపీగా ఉన్నారు. సినిమాకు హిట్ టాక్ వచ్చి …థియేట‌ర్‌లో ఎమౌంట్ డీసెంట్‌గా వ‌స్తే చాలు అని ఎదురుచూస్తున్నారు.

ఏరియా (కోట్లలో)

———————- ——————————–

నైజాం & ఆంధ్రా 5.00

సీడెడ్ 1.00

అమెరికా &మిగిలిన ప్రాంతాలు 0.90

మొత్తం ధియోటర్ రైట్స్ 6.90

హిందీ డబ్బింగ్ రైట్స్ 4.00

శాటిలైట్ రైట్స్ 3.10

ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ 14.00