2.0: దాచిన ఎలిమెంట్ నే … హైలెట్ చేస్తూ ప్రమోషన్

ఎనిమిదేళ్ల క్రితం అంటే 2010లో విడుద‌లైన రోబో చిత్రం అప్పట్లో సంచలనం. ఆ తతర్వాత ఇంతకాలానికి సీక్వెల్‌గా 2.0 అనే చిత్రం తెర‌కెక్కించి రిలీజ్ చేసారు. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. సినిమాకి హిట్ టాక్ రావ‌డంతో టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

ఈ చిత్రానికి సోషల్ మెసేజ్ అంశాన్ని జోడించి తెర‌కెక్కించిన శంక‌ర్ మ‌రో సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు 2.0 సినిమా చూసిన వారికి అర్ద‌మ‌వుతుంది. ముఖ్యంగా ‘2.0’కు, పక్షిరాజాకు మధ్య జరిగే యుద్ధాన్ని శంక‌ర్ చాలా అద్భుతంగా చూపించార‌ని చెప్పుకొస్తున్నారు.

ముఖ్యంగా చిట్టి అసెస్టెంట్ గా తెరపైకి వచ్చిన చిన్న రోబో…పిల్లలను, పెద్దలను బాగా ఆకర్షిస్తూ ఇప్పుడు అదే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. 3.0 అంటూ ఈ బుల్లి రోబోను శంకర్ పరిచయం చేసారు. అలాగే ఈ సినిమాకు సైతం సీక్వెల్ ఉంటుందని చిట్టి స్థానంలో కుట్టి (తెలుగులో చిన్ని) అనే సూపర్ హ్యూమనాయిడ్ రోబో ఉంటుందని హింటిస్తూ 2.0 సినిమాను ముగించాడు. ఇదంతా బాగానే ఉంది.

వాస్తవానకి 3.0కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం చిత్రం టీమ్ గమనించింది. తమ చిత్రం ప్రమోషన్ లో ఈ విషయాన్నే హైలెట్ చేస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ ట్వీట్ చేసిన వీడియో చూస్తే మనకు ఆ విషయం అర్దం అవుతుంది. ఆ వీడియోలో చిన్ని రోబో విజువల్స్ ఉంటాయి. ఓ రకంగా సినిమా రిలీజ్ దాకా ఆ విషయం దాచి పెట్టారు దర్శక,నిర్మాతలు. రిలీజ్ అయ్యాక దాన్నే పూర్తిగా నమ్ముకున్నారు.

ఇక శంక‌ర్ ఈ చిత్రం మూడో పార్ట్ కూడా ర‌జ‌నీకాంత్‌తోనే ప్లాన్ చేస్తారని క్ల‌యిమాక్స్ ద్వారా తెలుస్తోంది. అయితే.. మిగితా న‌టీన‌టులు ఎవ‌రు అనే దానిపై మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఐదు భాష‌ల‌లో విడుద‌లైన 2.0 చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే.