సినిమా వేరు..సినిమా చుట్టూ తిరిగే బిజినెస్ వేరు. బిజినెస్ కు కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు ప్రకారం ముందుకు వెళ్తేనే …తాము అనుకున్న రేటుకు బిజినెస్ చేయగలుగుతారు నిర్మాతలు. దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్స్ కు ఆ విషయం స్పష్టంగా తెలుసు. అయితే ఆ లెక్కలు ప్రకారం సినిమాలో మార్పులు చేస్తే ..అసలుకే మోసం వస్తుంది. సినిమాలు కథా పరంగా దెబ్బతింటాయి. ఇప్పుడు మహేష్ బాబు తాజా చిత్రం విషయంలో దిల్ రాజు తెచ్చిన ప్రపోజల్ ని హీరో,దర్శకుడు అందుకే రిజెక్ట్ చేసారట.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్ . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో చిత్రం బిజినెస్ ప్రారంభమైంది.
డిజిటల్, టెలివిజన్, డబ్బింగ్ హక్కుల్ని రూ.20 కోట్లకు అమ్మేసినట్లు సమాచారం. ఈ సినిమా విషయమై దిల్ రాజు పాతిక కోట్లు రైట్స్ నుంచి ఆశించారట. ఎందుకంటే రంగస్దలం కు 22 కోట్లు వచ్చాయి..ఈ సినిమాకు పెరిగాలి కదా అని దిల్ రాజు ఉద్దేశ్యం.
కానీ హిందీ డబ్బింగ్ వాళ్లు మాత్రం…22 కోట్లు ఇస్తాం…సినిమాలో ఇంకో ఫైట్ కలిపితే ఆ రేటు ఇస్తామని దిల్ రాజు దగ్గర ప్రపోజల్ పెట్టారట. ఈ విషయం హీరో, దర్శకుడు విభేదించారట. సినిమాలో అనవసరంగా ఫైట్ పెడితే కాన్సెప్టు దెబ్బతింటుందని, మీ బిజినెస్ లెక్కలతో సినిమాని దెబ్బ కొట్టద్దు అన్నారట. దాంతో దిల్ రాజు రెండు కోట్లు నష్టం అంటన్నారు.
‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ, సాయి కుమార్, కోటా శ్రీనివాసరావు, రావు రమేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత మహేష్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.