పాపం ఆయన్ని… ‘ఆమె’ గట్టిగానే దెబ్బ కొట్టింది !
అమలాపాల్ లీడ్‌లో నటించిన తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ‘ఆమె’ పేరుతో శుక్రవారం విడుదలకు ప్లాన్ చేసారు. అయితే మార్నింగ్ షోలు కాన్సిల్ అయ్యాయి. టికెట్ అడ్వాన్స్ గా తీసుకున్న వాళ్లకు ఈ విషయం తెలియలేదు. అలా పనిగట్టుకుని మరీ థియేటర్‌కి వెళ్లిన తర్వాత కానీ ఈ సినిమాకి ఫైనాన్సియల్ సమస్యలతో విడుదల కాలేదని అర్థం కాలేదు.
అయితే ఎక్కడీ సమస్య వచ్చిందీ అంటే … తమిళనాట ఈ సినిమా నిర్మాతకి, ఫైనాన్సియర్స్‌కి గొడవతో ఆగిపోయిందని తెలుస్తోంది. దాంతో వారు మార్నింగ్ షో రిలీజ్‌ని అడ్డుకున్నారు. మధ్యాహ్నానికి కొన్ని ఎగ్రిమెంట్స్ తో రాజీకొచ్చారు. సాయంత్రం నుంచి తమిళనాట సినిమా పడింది.
కానీ తెలుగులో ఈ సినిమాకి పూర్తిగా దెబ్బపడింది. . ఓపెనింగ్ మొత్తం ఎగిరిపోయాయి. ఎంతో డబ్బు ఇన్వెస్ట్ చేసి మరి కొనుక్కని రిలీజ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ కు ఇది తీరని దెబ్బే. అమలాపాల్ న్యూడ్‌గా నటించిందన్న ప్రచారంతో సినిమాకి తొలి ఆటకి మంచి అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించాయి.వాటిని క్యాష్ చేసుకోలేకోలేని సిట్యువేషన్ లో ఉండటం బ్యాడే.
ఎమ్.ఆర్ రత్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. ఈ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా నటించింది.
ఈ చిత్రంలో అమలాపాల్.. రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తోంది. డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్‌తో కనిపిస్తోంది అమలాపాల్. మగాళ్లతో కలిసి మందు, సిగరెట్‌లను ఊదేస్తూ.. ‘మనం పుట్టేటప్పుడు డ్రస్‌తోనా పుడుతున్నాం… మన డ్రెస్ మొత్తం విప్పేస్తే.. మన బాడీనే యాక్యువల్ బర్త్ డ్రెస్’ అంటూ మాట్లాడే మోడరన్ యువతిగా నటిస్తోంది.