మరోసారి పెళ్లికి సిద్ధమైన నటి..ఇలా మనసులో మాట బయట పెట్టిందిగా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకోవడం తిరిగి పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే బెజవాడ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అమలాపాల్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈమె అనంతరం నాయక్, ఇద్దరమ్మాయిలు, రఘువరన్ బీటెక్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఈ విధంగా పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అమలాపాల్ తమిళ్ డైరెక్టర్ విజయ్ ను 2014 లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొన్ని నెలల వ్యవధిలోని వీరిద్దరూ విడిపోయారు.

ఈ విధంగా విడాకులతో విడిపోయిన తర్వాత అమలాపాల్ వరుస సినిమాలలో నటిస్తూ భారీ స్కిన్ షో ద్వారా వరుస అవకాశాలను అందుకున్నారు. ఇకపోతే విడాకులు అయినప్పటి నుంచి ఈమె పలు సినిమాలలో నటిస్తూ ఒంటరిగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ అభిమాని ఈమె రెండో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకువచ్చారు.ఈ సందర్భంగా అభిమాని ప్రశ్నిస్తూ మీరు కనుక పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాడు రావాలి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని ప్రస్తుతం తనని తాను అర్థం చేసుకునే పనిలో ఉన్నానని, ఎప్పుడైతే నన్ను నేను ఉన్నతంగా మార్చుకుంటానో ఆ క్షణం పెళ్లి గురించి ఆలోచిస్తానని అప్పుడే తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాన్ని తెలియజేస్తానని ఈ సందర్భంగా అమలాపాల్ వెల్లడించారు.ఇకపోతే ఈమె చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నేటిజెన్లు అమలాపాల్ తిరిగి రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందని ఈ విధంగా తన ఆలోచనను బయటపెట్టిందని భావిస్తున్నారు.