‘డియర్‌ కామ్రేడ్‌’ క్లోజింగ్ కలెక్షన్స్.. లాస్ ఎంతంటే?!

‘డియర్‌ కామ్రేడ్‌’ క్లోజింగ్ కలెక్షన్స్ 

భారీ ప్రమోషన్స్ తో భారీ హైప్ తో ఒకేసారి నాలుగు భాషల్లో భారీగా విడుదలైన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి కి డివైడ్ టాక్ వచ్చినా.. విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ తో నిర్మాతలు సేఫ్ అయ్యిపోతారు. కొనుక్కున్న వాళ్లకు లాభాలు రాకపోవచ్చు కానీ నష్టం రాదని చాలా మంది అన్నారు. అయితే వారందిరి అంచనాలు తప్పని తేలిపోయింది, ఫస్ట్ వీకెండ్ లో ఫర్వాలేదనిపించుకున్న డియర్ కామ్రేడ్ వసూళ్లు రోజు రోజుకు డ్రాప్ అవుతూ క్లోజిగ్ కు వచ్చేసాయి. సినిమాకు బ్యాడ్ టాక్ బాగా స్ర్రెడ్ అవటంతో, ట్రిమ్ చేసినా ఫలితం లేకుండాపోయింది.

దాంతో ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయారు. ఫైనల్ గా సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే షాకయ్యే పరిస్దితి. 34కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారీగా విడుదలైన డియర్ కామ్రేడ్ వరల్డ్ వైడ్ గా 21.47కోట్లను మాత్రమే రాబట్టగలిగిగింది. తెలుగులో మాత్రమే కాదు..తమిళ్ లో అలాగే మలయాళంలో డియర్ కామ్రేడ్ నిర్మాతలకు బారి నష్టాలను కలుగజేసినట్లు తెలుస్తోంది.

హిట్ పెయిర్‌గా ‘గీత‌గోవిందం’లో పేరు సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌గా న‌టించారు. ఓ కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్‌, స్టేట్ లేడీ క్రికెట‌ర్ మ‌ధ్య సాగే ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ – బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు.