‘డియర్ కామ్రేడ్’ అక్కడ మరీ డిజాస్టర్ స్దాయి

‘డియర్ కామ్రేడ్’ అక్కడ మరీ డిజాస్టర్ స్దాయి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 26న సౌతిండియాలోని 4 భాషల్లో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే దాదాపు అన్ని చోట్లా కలెక్షన్స్ బాగున్నాయి. కానీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సీడెడ్ లో బాగా లో కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. అక్కడ మాత్రమే డిజాస్టర్ స్దాయిలో కలెక్షన్స్ ఉండటం ఆశ్చర్య పరుస్ంతోంది.

మొదటి రోజు సీడెడ్ లో 88 లక్షల షేర్ సాధించిన డియర్ కామ్రేడ్ ఆ తర్వాత రోజు భారీగా ఫాల్ కనపడింది. 25 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. మూడవ రోజు అదీ పరిస్దితి. మూడున్నర కోట్లకు అక్కడ ఈ చిత్రం రైట్స్ అమ్మకం జరిగింది. దాంతో మనిమం 50% లాస్ వస్తుందని, రికవరీ కష్టమని తేలుస్తున్నారు. విజయదేవరకొండపై క్రేజ్ తో ఈ సినిమా ఓపినింగ్స్ బాగున్నా, రెండో రోజుకే డివైడ్ టాక్ స్పెడ్ అవటం దెబ్బ కొట్టింది. ముఖ్యంగా స్లో పేస్ లో సినిమా నడవటం ఇబ్బందికరంగా మారింది.

మూడు రోజుల్లో ‘డియర్ కామ్రేడ్’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.19.28 కోట్లుగా ఉందని సమాచారం. శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు రూ.3 కోట్ల చొప్పున గ్రాస్ వసూలు చేసిందని తెలిసింది. మరోవైపు, యూఎస్‌లో ‘డియర్ కామ్రేడ్’ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు 7 లక్షల డాలర్లకు పైగా (సుమారు రూ.5 కోట్లు) వసూలు చేసినట్లు యూఎస్‌లో ఈ సినిమాను విడుదల చేసిన ‘సరిగమ సినిమాస్’ ట్వీట్ చేసింది.