కరోనా పరిస్థితులు తర్వాత ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. సినిమా టికెట్ ధరల విషయంలో అయితే చాలా ఆసక్తిగా అంతా మారింది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరింత దారుణంగా పరిస్థితులు మారగా థియేటర్స్ కి జనం ఓ సందర్భంలో కరువయ్యారు.
అయితే సినిమాల బడ్జెట్ పరంగా ముందు కన్నా భారీగా టికెట్ రేట్లు పెంచడం అనేది గట్టి దెబ్బ అయ్యింది. దీనితో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే సామాన్యులకి అందుబాటి ధరలో టికెట్ రేట్ ఉంటే అందులోని సినిమాలో కూడా మేటర్ ఉంటే మాత్రం తప్పకుండ ఆ సినిమాని ఆదరిస్తారని టాలీవుడ్ సహా బాలీవుడ్ వర్గాలు ఇప్పుడే తెలుసుకున్నాయి.
అందుకే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు. రీసెంట్ గా అంటే ఈ సెప్టెంబర్ 23న ప్రపంచ సినిమా దినోత్సవం కాగా ఆరోజు కేవలం టికెట్ ధర 75 రూపాయలు మాత్రమే దేశ వ్యాప్తంగా మల్టీ ప్లెక్స్ లలో అమ్మారు. దీనితో ఆ ఒక్కరోజు చాలా సినిమాలకే భారీ వసూళ్లు వచ్చాయి.
అలాంటి చిత్రాల్లో బాలీవుడ్ లేటెస్ట్ భారీ సినిమా “బ్రహ్మాస్త్ర” కూడా ఒకటి. రణబీర్ ఆలియా లు నటించిన ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా రాగా ఈ సినిమాకి ఆ ఒక్కరోజు 9 కోట్లు హిందీలో వసూలు అయ్యాయి. దీనితో సినిమా రిలీజ్ అయ్యిన మూడో వారం అత్యధిక వసూళ్లు అందుకున్న రెండో సినిమాగా ఇది నిలిచింది.(మొదటి స్థానంలో బాహుబలి 2 ఉంది).
దీనితో టికెట్ ధర తక్కువ ఉంటే జనం వస్తున్నారని గ్రహించిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ ట్రిక్ ని ఫాలో అవుతున్నారట. ఈ సోమవారం నుంచి ఈ చిత్రం టికెట్ ధర కేవలం 100 రూపాయలే పెడుతున్నారట. దీనితో ఇది కూడా హిందీలో డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అని వారు అనుకుంటున్నారు. మరి ఇది కూడా వర్కౌట్ అయితే నెక్స్ట్ సినిమాలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవ్వొచ్చని చెప్పాలి.