డే 1 “లైగర్” మూవీ వసూళ్లు ఎలా వచ్చాయో చూడండి.!

చాలా అంచనాలు నడుమ ఈ ఏడాది రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాద్ అలాగే హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకోని రీతిలో డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.

దీనితో ఈ సినిమా ఫస్ట్ డే ఎలాగో ఉన్న అంచనాలకి తగ్గట్టే వసూళ్లు వస్తాయని అంతా ఆశించారు. కానీ ఈ చిత్రం మాత్రం షాకింగ్ వసూళ్లనే అందుకున్నట్టుఉ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొదట తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చూస్తే తెలంగాణాలో 4.2 కోట్లు షేర్ అందుకోగా సీడెడ్ లో 1.35 కోట్లు అలాగే ఉత్తరాంధ్రలో 1.25 కోట్లు షేర్ అందుకుంది.

ఇక మిగతా ఏపీ ఏరియాలు అన్నీ కలిపి ఈ చిత్రం ఏపీ తెలంగాణాలో 9.5 కోట్ల షేర్ వచ్చిందట. అలాగే దీనితో పాటుగా ఓవర్సీస్ లో 5 లక్షల డాలర్స్ ఫస్ట్ డే నాటికి వసూలు చేయగా హిందీలో అయితే అనుకోని రీతిలో డిజాస్టర్ ఓపెనింగ్స్ నే నమోడీ అయ్యినట్టు తెలుస్తుంది.

దీనితో ఓవరాల్ గా ఈ చిత్రం 25 నుంచి 28 కోట్ల మేర గ్రాస్ 13 కోట్ల మేర షేర్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక టాక్ కూడా బాగాలేదు దీనితో అయితే ఈ సినిమాకి కూడా భారీ నష్టాలు తప్పేలా లేవని చెప్పక తప్పదు.