ఓటిటి : ఇందులో పాన్ ఇండియా భాషల్లో వచ్చేసిన “ఖుషి”

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర డీసెంట్ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత ల కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఫామిలీ డ్రామా “ఖుషి” కూడా ఒకటి. మరి సమంత తనకి ఆరోగ్యం బాగోలేని సమయంలోనే ఈ సినిమాని కంప్లీట్ చేయగా..

అప్పటికే డిజాస్టర్ లో ఉన్న విజయ్ కూడా ఈ సినిమా చేసి డిఫరెంట్ ప్రమోషన్స్ ని చేసుకొని ఫైనల్ గా తమ ఇద్దరి కెరీర్ లో కూడా మంచి సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. కాగా ఈ చిత్రం ఆశ్చర్యకరంగా తమిళ్ లో గుడ్ రన్ ని కొనసాగిస్తుండగా అంతే కాకుండా వీకెండ్ టైం హౌస్ ఫుల్స్ కూడా పడుతున్నాయని అంటున్నారు.

కానీ ఫైనల్ గా ఇప్పుడు ఓటిటిలో దర్శనం ఇచ్చింది. కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం తెలుగు హిందీ, తమిళ్ కన్నడ మరియు మలయాళ భాషలు ఇలా పాన్ ఇండియా రిలీజ్ అయితే థియేట్రికల్ తో పాటుగా ఓటిటి  కూడా అయ్యింది అని చెప్పాలి.

అయితే ఈ చిత్రం విడుదల అయ్యిన జస్ట్ ఒక్క నెల లోనే వచ్చేయడం గమనార్హం. ఇంకా ఈ చిత్రాన్ని దర్శకుడు నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.