బాక్సాఫీస్ : “లైగర్” గట్టెక్కాలంటే వరల్డ్ వైడ్ ఎంత రాబట్టాలో తెలుసా.?

భారీ అంచనాలు పెట్టుకొని ఇండియన్ బాక్సాఫీస్ మీదకి దూసుకొచ్చిన లేటెస్ట్ సినిమా “లైగర్” కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ అలాగే హీరోయిన్ అనన్య పాండే ల కెరీర్ లోనే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ హైప్ తో ఈరోజు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి వచ్చింది.

ఇంకా చెప్పాలంటే మన దగ్గర తెలుగు స్టార్స్ హీరోలకి ధీటుగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా బుకింగ్స్ నమోదు అయ్యాయి అంటే అందులో ఆశ్చర్యం కూడా లేదు. ఇక ఫస్ట్ షో తో ఎలాగో టాక్ బయటకి వచ్చింది. భారీ టార్గెట్స్ పెట్టుకొనే ఈ సినిమా రిలీజ్ కాగా అసలు ఈ సినిమా ఎంత వసూలు చేస్తే బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతుంది అనేది ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు సహా హిందీ అన్ని భాషలు ఓవర్సీస్ మార్కెట్ లో కలిపి ఏకంగా 90 కోట్ల రికార్డు బిజినెస్ ని జరిపింది అట. ఇది చిన్న విషయం కాదు కానీ ఓవరాల్ గా 100 కోట్లకి పైగా షేర్ ని 200 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా వసూలు చేస్తే కానీ బాక్సాఫీస్ సక్సెస్ కాదు.

అయితే ఈ చిత్రం ఫస్ట్ డే మాత్రం ఎలా లేదన్నా వరల్డ్ వైడ్ 20 కోట్లు షేర్ రాబట్టొచ్చని అంటున్నారు. మరి ఫైనల్ మార్క్ లో అయితే ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.