బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ “బింబిసార” రెండు రోజుల కలెక్షన్ డీటైల్స్.!

Bimbisara Movie Review

ఈ ఏడాది టాలీవుడ్ లో నెలకొన్నటువంటి ఊహించని సంక్షోభంపై ఫైనల్ గా ఈ వారం రిలీజ్ సినిమాలతో తెర పడింది. రిలీజ్ అయ్యిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ తో పాటు మంచి వసూళ్లనే అందుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ నమోదు అవుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా మంచి హైప్ తో వచ్చిన సినిమా “బింబిసార” హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో సూపర్ వసూళ్లను రాబడుతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. ఓపెనింగ్ డే నే భారీ వసూళ్లు ఏపీ తెలంగాణాలో 6.3 కోట్లు రాబట్టగా ఇపుడు ఇదే తెలుగు స్టేట్స్ లో అయితే రెండు రోజులకి గాను 11 కోట్ల షేర్ ని ఈ సినిమా రాబట్టినట్టుగా ట్రేడ్ విశ్లేషకులు కన్ఫర్మ్ చేసారు.

మరి దీనితో పాటుగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా అదరగొడుతుంది అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. అక్కడ లేటెస్ట్ గా ఈ చిత్రం 2 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ ని టచ్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అన్నట్టు తెలుగులో అయితే ఈ చిత్రం 95 శాతం వసూళ్లు రాబట్టేసిందట.

ఇది మరో సెన్సేషన్ అని చెప్పాలి. మొత్తానికి అయితే బింబిసార తో ఒక కొత్త ఊపు ఇండస్ట్రీలో వచ్చింది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా సంయుక్త మీనన్, క్యాథరిన్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరిగింది.