బాక్సాఫీస్ రిపోర్ట్ : తెలుగులో “బ్రహ్మాస్త్ర” డే 1 వసూళ్లు.. 8 ఏళ్ల రికార్డు బద్దలు..!

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “బ్రహ్మాస్త్ర” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అయినా బాలీవుడ్ నుంచి ఓ పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా హిట్ గా నిలుస్తుందా అని అక్కడి ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా చూసారు.

మరి ఫైనల్ గా రిలీజ్ అయ్యిన సినిమా అయితే మన తెలుగులో కూడా క్రేజీ బజ్ ని సొంతం చేసుకొని భారీ అంచనాలు పెట్టుకొని మన దగ్గర కూడా వచ్చింది. అయితే ఈ చిత్రానికి మన వాళ్ళు కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఇచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాయి.

ఈ చిత్రం ఏకంగా బాలీవుడ్ సినిమాలు మన దగ్గర నెలకొల్పిన ఎనిమిదేళ్ల కితం రికార్డు ని బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నారు. ఎనిమిదేళ్ల కితం వచ్చిన అమీర్ ఖాన్ భారీ చిత్రం “ధూమ్ 3” ఇక్కడ మూడున్నర కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకోగా దానిని ఇప్పుడు ఫైనల్ గా బ్రహ్మాస్త్ర బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది.

మరి మన దగ్గర అయితే ఈ చిత్రం ఫస్ట్ డే 5 కోట్లకి పైగానే వసూలు చేసిందని అంటున్నారు. దీనితో ఫైనల్ గా ఆ రికార్డు ఇన్నేళ్ల తర్వాత బ్రేక్ అయ్యింది. మన దగ్గర టాక్ కూడా కాస్త అటు ఇటు గానే ఉన్నా బిజినెస్ పరంగా సినిమా గట్టెక్కేసే అవకాశం లేకపోలేదని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో అయితే రణబీర్ కాపుర హీరోగా నటించగా ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. అలాగే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఇంకా మన తెలుగు స్టార్ హీరో నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటించారు.