అమలాపాల్ ‘ఆమె’ మార్నింగ్ ‘షో’లు కాన్సిల్ !
అమలాపాల్ లీడ్‌లో నటించిన తమిళ చిత్రం ‘ఆడై’ను తెలుగులో ‘ఆమె’ పేరుతో ఈ రోజు అంతటా విడుదల చేసారు. అయితే తెలుగులో మాత్రం షోలు కాన్సిల్ అయ్యాయి. అనివార్య కారణాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మార్నింగ్ షోలు రద్దు అయ్యాయని చెప్తున్నారు. రద్దు అవటానికి గల కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే డబ్బింగ్ కు సంభందించి కొన్ని టెక్నికల్ ఇష్యూలతో ఈ షోలు కాన్సిల్ చేసారని తెలుస్తోంది.
ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ‘ఆడై ‘ తమిళనాడులో 500 స్క్రీన్లలో ఈ ఉదయం విడుదలైంది. ఈ సినిమా కొత్త కాన్సెప్ట్స్ పై ఇంట్రస్ట్ చూపే ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని.. అలాగే సినిమాలో కాన్సెప్ట్ తో పాటు విజువల్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.
ఎమ్.ఆర్ రత్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేస్తున్నారు. తమిళ్‌లో ఆడై అంటే ‘డ్రస్’ అని అర్ధం. ఈ టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్‌లో అమలాపాల్ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా నటించింది.
ఈ చిత్రంలో అమలాపాల్.. రెండు వైవిధ్యభరిత పాత్రల్లో నటిస్తోంది. డేరింగ్ అండ్ డాషింగ్ బిహేవియర్‌తో కనిపిస్తోంది అమలాపాల్. మగాళ్లతో కలిసి మందు, సిగరెట్‌లను ఊదేస్తూ.. ‘మనం పుట్టేటప్పుడు డ్రస్‌తోనా పుడుతున్నాం… మన డ్రెస్ మొత్తం విప్పేస్తే.. మన బాడీనే యాక్యువల్ బర్త్ డ్రెస్’ అంటూ మాట్లాడే మోడరన్ యువతిగా నటిస్తోంది.
. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఒ. ఫణీంద్ర కుమార్, సంగీతం: ప్రదీప్ కుమార్, ఊర్క, కెమెరా: విజయ్ కార్తీక్ ఖన్నన్, వీఎఫ్‌ఎక్స్ ప్రొడ్యూసర్: హరిహర సుతన్.