‘గీతాగోవిందం’ తర్వాత USA డిస్ట్రిబ్యూటర్స్ స్థితి భజగోవిందం

ఈ రోజుల్లో తెలుగు నిర్మాతలంతా..తమ బడ్జెట్ లో మాగ్జిమం సగమైనా ..USA డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నుంచి లాగేయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. తమ సినిమాలను పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ తో హైప్ క్రియేట్ చేస్తూ భారీ రేటుతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కు అమ్ముతున్నారు. అయితే అక్కడ పోటీ ఎక్కువై మంచి రేట్ పెట్టుకొనుక్కోవటమే కానీ…చాలా సినిమాలకు ప్రింట్ ఛార్జీలు కూడా రావటం లేదనేది నిజం.

అంతెందుకు గత మూడు నెలలుగా ..గీతా గోవిందం తర్వాత..దాదాపు 15 సినిమాలు రిలీజైతే వాటిలో ఒక్కటీ కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ఆటగాళ్లు, నర్తనశాల, పేపర్ బోయ్, సిల్లీ ఫెలోస్, మను, శైలజా రెడ్డి అల్లుడు, నన్ను దోచుకుందువటే, నోటా, హలో గురు ప్రేమ కోసమే, వీరభోగ వసంత రాయులు, అదిగో ..సినిమాలు ప్రింట్స్, పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టుకోవటం కష్టమైన వైనం ..అక్కడ సినిమా బిజినెస్ లో ఉన్నవాళ్లను భయపెడుతోంది అనటం అతిశయోక్తికాదు.

ఇక దేవదాసు, అరవింద సమేత, సవ్యసాచి సినిమాలు ఓపినింగ్స్ బాగా తెచ్చుకున్నా, కలెక్షన్స్ బాగా వచ్చినా..వాళ్లు కొన్న రేటుకు ..ఈ కలెక్షన్స్ కు సాపత్యం కుదరక ..లాభాలు రాక గింజుకునే పరిస్దితి.

దీనికంతటికీ కారణమేంటి?

ఒకప్పుడు యుఎస్ డిస్ట్రిబ్యూషన్ అంటే లాభాలే పంటే అనుకున్న సిట్యువేషన్ నుంచి ఈ రోజు లాస్ లతో ఎప్పుడో వచ్చిన లాభాలును కరగపెట్టుకోవాల్సిన స్దితి కు వచ్చింది. దీనికి కారణం నిర్మాతలు…అత్యాశ, డిస్ట్రిబ్యూటర్స్ కు వేరే ఆప్షన్ లేకపోవటం..ప్రతీ సారి..హైప్ చూసి రికవరీ ఉంటుందని భావించటం.

ఏదో ఒకటి హిట్ అయితే దాన్ని చూసి మిగతావాళ్ళంతా ఉత్సాహపడి ఎక్కువరేటుకు సినిమాలు కొనటం. మార్నింగ్ షో కు ప్లాఫ్ టాక్ రివ్యూలు వచ్చాయంటే ఇక ఆ సినిమాకు పైసా కూడా వసూలు కాకపోవటం..ఈ పరిస్దితి మారాలంటే ..నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇద్దరూ కూడా అక్కడ మార్కెట్ ని ఎనాలసిస్ చేసుకుని రంగంలోకి దిగాలి.