బాయ్‌ఫ్రెండ్‌కి అలా ఆదుకున్న రష్మిక మండన్నా.?

రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతోందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అబ్బే మా మధ్య అలాంటిదేం లేదంటూ, అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఎస్కేప్ అయిపోతున్నా.. ఎప్పటికప్పుడే పబ్లిగ్గా ఈ జంట దొరికేస్తూనే వుంది.

అయినా సరే, ఒప్పుకోవడం లేదు తమ మధ్య రిలేషన్‌ని బయట పెట్టడం లేదు. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ కోసం ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ సెట్ చేసిందట రష్మిక మండన్నా.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ అస్సలు ఫామ్‌లో లేడన్న సంగతి తెలిసిందే. ‘లైగర్’ ఇచ్చిన ఎఫెక్ట్ అది. అయితే, రష్మిక, విజయ్ దేవరకొండ పెయిర్‌కి మాత్రం మంచి క్రేజ్ వుంది.

సో, రష్మిక, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లోనే ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందట. ఈ మధ్య విజయ్ దేవరకొండ తరచూ ముంబై వెళ్లి వస్తున్నాడు. రష్మిక దాదాపు అక్కడే వుంటోంది. అలా, ఈ జంటతో ఓ సినిమా తెరకెక్కించాలని ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ అనుకుంటోందట. దాదాపు ఆ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లే అని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్.