అతనితో నా పెళ్లయిపోయింది: నటి రష్మిక సంచలన కామెంట్స్‌!

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌లో ఉందని చాలాకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై ఎన్నో సందర్భాల్లో వీరిద్దరూ స్పందించినా ఆ గాసిప్‌లు మాత్రం ఆగలేదు. ’గీత గోవిందం’ చిత్రం నుంచి ఈ జంటకు పెరిగిన క్రేజ్‌ అలాంటివి. తాజాగా రష్మిక మనసులో ఉన్న వ్యక్తి గురించి చెప్పింది. దాంతో మరోసారి అందరూ విజయ్‌ అనే అనుకున్నారు.

ఇటీవల ఓ ప్రమోషన్‌కి వెళ్లిన రష్మికను హోస్ట్‌ తనకు ఇష్టమైన వ్యక్తి, పెళ్లి గురించి ప్రస్తావించగా ’నరుటోతో నా పెల్ళైపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు’ అని రష్మిక సమాధానం ఇచ్చింది. ’నరుటో’అనేది ఫేమస్‌ అయిన ఎనివిూ సిరీస్‌లో ఓ పాత్ర పేరు. ఈ సిరీస్‌కు అందులోని పాత్రలకు ప్రత్యేకమైన అభిమానగణం ఉంటుంది. అందులో రష్మిక కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ’పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది రష్మిక. దీనితోపాటు సందీప్‌ రెడ్డి వంగా ’యానిమల్‌’ తోపాటు ’రెయిన్‌ బో’ అనే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా కూడా చేస్తోంది.