“2.0”:ఇండియాలో 5 రోజుల కలక్షన్స్ ..ఇంకా రిస్కే

సూపర్ స్టార్ రజినీ కాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.0. ఈ సినిమా మొన్న గురువారం విడుదలై బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. లింగ , కబాలి , కాలా చిత్రాలతో నిరాశ పరిచిన రజినీ మళ్ళీ ఈ చిత్రం తో ఫామ్ లోకి వచ్చారని అభిమానులు ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు. మొదటి ఐదు రోజల్లో దేశవ్యాప్తంగా రూ. 140.81 కోట్ల రూపాయల షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఐదు రోజుల ఇండియా వైడ్ కలెక్షన్స్:

ఆంధ్రా + తెలంగాణా: 36.08 కోట్లు
తమిళ నాడు: 35.12 కోట్లు
కేరళ: 5.67 కోట్లు
కర్ణాటక: 11.28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 52.66 కోట్లు

ఇండియా టోటల్: 140.81 కోట్ల షేర్

అయితే ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ లెక్కలు చూస్తే.. ఇప్పటివరకూ రికవర్ అయిన షేర్ 50% లోపే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 2.0 హక్కులను రూ.. 75 కోట్లకు అమ్మారు . ఐదు రోజులకు గానూ ఈ చిత్రం రూ. 36.08 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. ఇక తమిళ నాడులో దాదాపు రూ. 100 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మారని సమాచారం. కాబట్టి తెలుగు, తమిళం మాత్రం బ్రేక్ ఈవెన్ కు చాలా టైమ్ పట్టేటట్లు ఉంది.